మరోసారి విజయ్ - రష్మిక కాంబో.. సెట్టయ్యేనా?
అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌తో వార్తల్లోకి ఎంటర్ అయ్యాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’తో మరోసారి ఫుల్ ఫామ్‌లో కనిపించబోతున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ట్రైలర్, పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. జూలై 31న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న కింగ్‌డమ్ విజయ్ కెరీర్‌కు మళ్లీ పికప్ ఇవ్వబోతుందని అభిమానులు ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
రాహుల్ తో కొత్త సినిమా
ఇప్పటికే విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కింగ్‌డమ్ తర్వాత ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. అయితే ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌తో వార్తల్లోకి ఎంటర్ అయ్యాడు. శ్యామ్ సింగ రాయ్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఈ సినిమానీ గత ఏడాదిలోనే అధికారికంగా అనౌన్స్ చేశారు.
మరోసారి గీతా గోవిందం కాంబో
ఇక మరో వైపు ఈ సినిమా ద్వారా విజయ్, రష్మిక మందన్నల క్రేజీ జోడీ మళ్లీ కలవబోతున్నట్లు తెలుస్తోంది. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్‌ల్లో వీరి కెమిస్ట్రీతో సినిమాలు సూపర్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాకు కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిన్న నిరాశ ఎదురైంది. ఈ నెల మొదటివారంలో షూటింగ్ స్టార్ట్ చేయాల్సిన షెడ్యూల్‌ను పలు కారణాలతో వాయిదా వేశారు. త్వరలోనే షూటింగ్ పునఃప్రారంభమవుతుందని మేకర్స్ చెబుతున్నారు.
రష్మిక మందన్న హవా
ఇంకా హీరోయిన్ రష్మిక మందన్న గురించి మాట్లాడుకుంటే.. నేషనల్ క్రష్‌గా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ రెసెంట్ సినిమాలతో పాన్ ఇండియా హిట్స్ అందుకుంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో పాటు, మిస్సా అనే సినిమా కూడా చేస్తున్న రష్మిక.. బాలీవుడ్, సౌత్ సినిమాలకు బ్రిడ్జ్‌గా నిలుస్తోంది. తాజాగా విజయ్ దేవరకొండతో మూడోసారి జత కడుతున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
నాన్ స్టాప్ రూమర్స్
మరో వైపు రష్మిక-వ జయ్ రియల్ లైఫ్‌లో కూడా రూమర్‌డ్ కపుల్‌గా చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వీరిద్దరి పోస్టుల్లో వచ్చే కౌన్స్, పోజ్‌లు చూడగా వీళ్ల మధ్య ఉన్న స్పెషల్ రిలేషన్‌షిప్‌కు మరోసారి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాంటిది విజయ్-రష్మిక జోడీ మళ్లీ ఓ సినిమా కోసం కలుస్తుండటంతో టాలీవుడ్‌లో హైప్ పెరిగింది. ఇప్పటికే గత సినిమాల సక్సెస్, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన ప్రేక్షకులు మళ్లీ వారి జంటను వెండితెరపై చూడాలనే ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఇక మరోసారి గీతా గోవిందం మ్యాజిక్ రిపీట్ అవుతుందా అనేది చూడాలి.