విజయ్ కనిపిస్తే ముఖం పగులగొడతా - రంజిత్

చాలామంది దేశాన్ని పాలించే ప్రధాన మంత్రికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని నాయకుడు రాష్ట్రాన్నేం పాలిస్తాడు అంటూ విమర్శలు గుప్పించారు.;

Update: 2025-09-01 07:37 GMT

చాలామంది సినీ సెలబ్రిటీలు సినిమాల్లోకి వచ్చి స్టార్లుగా రాణించాక.. రాజకీయాల మీద మక్కువతో రాజకీయాల్లోకి వెళ్లి.. ఆ రంగంలో కూడా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అలా మనకు తెలిసిన చాలామంది సినీ సెలబ్రిటీలు సినిమాల్లో రాణించడమే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. కొంతమంది ముఖ్యమంత్రులు,

మంత్రులు,ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అలా తమిళ నటుడు విజయ్ దళపతి కూడా తమిళ వెట్రికజగం అనే పార్టీతో తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. తమిళనాడులో జరగబోతున్న 2026 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

ప్రధానిపై విజయ్ దళపతి ఊహించని కామెంట్స్..

ఇక తమిళనాడులో ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ వంటి పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు వ్యతిరేకంగా ముఖ్యంగా డీఎంకే పార్టీకి వ్యతిరేకంగా టీవీకే పార్టీని స్థాపించారు విజయ్ దళపతి ఇప్పటికే రెండు మహానాడు సభలను పెట్టి సక్సెస్ఫుల్ అయ్యారు. అలా టీవీకే పార్టీ మొదటి మహానాడు సభ విళ్లుపురం జిల్లా విక్రవాండిలో జరిగింది. ఇక రెండో మహానాడు సభ మధురైలో జరిగింది. అయితే ఈ మధురైలో జరిగిన మహానాడు సభలో ప్రధానమంత్రిని, బిజెపి పార్టీని ఉద్దేశించి విజయ్ దళపతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధాని హోదాలో ఉన్న మోడీని ఉద్దేశించి చిటికెలు వేస్తూ మాట్లాడడం.. మిస్టర్ అని పిలవడం బీజేపీ నాయకులకు నచ్చలేదు.

విజయ్ ముఖం బద్దలు కొడతాను -డైరెక్టర్ రంజిత్

చాలామంది దేశాన్ని పాలించే ప్రధాన మంత్రికి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియని నాయకుడు రాష్ట్రాన్నేం పాలిస్తాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధానమంత్రిపై విజయ్ దళపతి చేసిన ఈ వ్యాఖ్యలపై నటుడు, దర్శకుడు అయినటువంటి రంజిత్ మండిపడ్డారు. తాజాగా కోయంబత్తూర్ తుడియలూర్ లో జరిగిన వినాయక చతుర్థి ఊరేగింపు వేడుకల్లో పాల్గొన్న రంజిత్.. విజయ్ దళపతిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "విజయ్ దళపతి ప్రధానమంత్రిని చిటికెలు వేస్తూ మాట్లాడడం పెద్ద తప్పు.. ఒకవేళ నాకు విజయ్ ఎదురైతే మాత్రం కచ్చితంగా ఆయన మొహం బద్దలు కొడతాను" అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రంజిత్ పై సోషల్ మీడియాలో వ్యతిరేకత..

రంజిత్ మాట్లాడిన మాటలు మీడియాలో వైరల్ గా మారడంతో విజయ్ అభిమానులతో పాటు టీవీకే పార్టీ నిర్వాహకులు రంజిత్ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. రంజిత్ మాట్లాడిన మాటలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని,కచ్చితంగా రంజిత్ పై యాక్షన్ తీసుకోవాల్సిందే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి రంజిత్ పై వచ్చిన ఈ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? రంజిత్ మీద ఏదైనా యాక్షన్ తీసుకుంటారా? అనేది చూడాలి.

విజయ్ సినిమాలు..

విజయ్ ఆఖరి సినిమాగా జననాయగన్ అంటూ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు. హెచ్ వినోద్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags:    

Similar News