ప్రధాని సాక్షిగా 'కింగ్‌డమ్'కి హైప్ పెంచిన దేవరకొండ
తాజాగా వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న దేవరకొండ తన సినిమా గురించి చాలా సంగతులు ముచ్చటించారు.;
లైగర్ లాంటి పాన్ ఇండియా సినిమా ఘోర పరాజయం విజయ్ దేవరకొండను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత అతడు ఆచితూచి అడుగులేస్తున్నాడు. ఇప్పుడు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని పంతంతో ఉన్నాడు. అతడు నటిస్తున్న కింగ్ డమ్ ని పాన్ ఇండియాలో సక్సెస్ చేయాలనే పట్టుదల అతడిలో కనిపిస్తోంది. తన సినిమాని జాతీయ వేదికపై ప్రమోట్ చేసుకుంటున్న తీరు ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న దేవరకొండ తన సినిమా గురించి చాలా సంగతులు ముచ్చటించారు.
దేవరకొండ తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని వివరిస్తూ.. తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడారు. కింగ్‌డమ్ హిందీ వెర్షన్ లో కథానాయకుడి పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు రణ్‌బీర్ కపూర్ ను ఎందుకు ప్రధానంగా ఎంపిక చేసుకున్నాడో విజయ్ తెలిపాడు. కింగ్‌డమ్ హిందీ టీజర్ కూడా 2025 కార్యక్రమంలో ప్రీమియర్ అయింది. ఇది ప్రేక్షకులలో ఉత్సుకతను రేకెత్తించింది. ఇక ఇదే వేదికపై బాలీవుడ్ నటి యామి గౌతమ్-విజయ్ దేవరకొండ ఇద్దరూ ఫోటోల కోసం ప్రధాని నరేంద్ర మోడీతో పోజులిచ్చారు. యామి సాంప్రదాయ లుక్‌లో అద్భుతంగా కనిపించగా, దేవరకొండ కూడా సాంప్రదాయ దుస్తులలో కనిపించాడు. అయితే అతడు కింగ్ డమ్ లో తన పాత్ర గెటప్ తో దర్శనమిచ్చాడు. కుర్తా -పైజామాలో చాలా స్మార్ట్ గా కనిపించాడు.
టెలివిజన్‌లో తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు పెద్ద తెరపై తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న అమిత్ సాధ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పద్మావత్ చిత్రంలో మాలిక్ కాఫర్ పాత్రకు పేరుగాంచిన జిమ్ సర్బ్ కూడా కాన్ క్లేవ్ లో ప్రధానితో సమావేశంలో కనిపించారు.
యామి ఏం మాట్లాడింది?
బాలీవుడ్ నటి యామి గౌతమ్ `వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్‌క్లేవ్`లో దేవరకొండతో పాటు కనిపించారు. భారతదేశం ఇప్పుడు `ప్రపంచ వేదికపై అపారమైన భారత వినోద రంగం ప్రభావం`పై మాట్లాడింది. చిత్ర పరిశ్రమ ప్రతినిధిగా, యామి ప్రపంచ వేదికపై సినీపరిశ్రమ ప్రభావం, సామర్థ్యాలను హైలైట్ చేసింది. కథ చెప్పడం, రాజకీయాల గురించి, ఆర్టికల్ 370 గురించి కూడా మాట్లాడింది. క్లిష్ఠమైన పాత్రను ఎంపిక చేయడంలో సవాళ్ల గురించి యామి మాట్లాడింది.