నో సెన్సార్ ..కానీ టికెట్ ప్రైజ్ 5కె!

విజ‌య్ చివ‌రి సినిమా కావ‌డంతో ఈ స్థాయిలో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టికెట్స్‌కు డిమాండ్ ఏర్ప‌డింద‌ని, అంత అయినా స‌రే అభిమానుల‌, విజ‌య్ ఫాలోవ‌ర్స్ టికెట్స్ తీసుకోవ‌డానికి ముందుకొస్తున్నార‌ట‌.;

Update: 2026-01-07 12:52 GMT

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా `జ‌న నాయ‌కుడు` జ‌న‌వ‌రి 9న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. తెలుగు హిట్ ఫిల్మ్ `భ‌గ‌వంత్ కేస‌రి` ఆధారంగా రూపొందిన ఈ మూవీ చుట్టూ సెన్సార్ వివాదం న‌డుస్తోంది. మ‌రో 48 గంట‌ల్లో రిలీజ్ కానున్న నేప‌థ్యంలో ఈ మూవీకి ఇంత వ‌ర‌కు సెన్సార్ క్లియ‌రెన్స్ రాలేదు. దీనిపై ఇప్ప‌టికే చిత్ర వ‌ర్గాలు మ‌ద్రాసు హైకోర్టుని ఆశ్ర‌యించాయి. ఈ నేప‌థ్యంలోనే హైకోర్టు కేంద్ర సెన్సార్ బోర్డు స్పందించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.

సినిమాపై ఫిర్యాదులు రావ‌డంతో కొత్త క‌మిటీ మ‌ళ్లీ చూడాల్సి ఉంద‌ని, దానికి గ‌డువు కావాల‌ని సెన్సార్ బోర్డ్ త‌రుపు న్యాయ‌వాదులు తెలిపిపారు. అయితే విడుద‌లకు గ‌డువు కొన్ని రోజులే ఉంద‌ని, కొత్త క‌మిటీకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌ని నిర్మాణ సంస్థ త‌రుపు లాయ‌ర్‌లు స్ప‌ష్టం చేశారు. దీంతో త‌దుప‌రి విచార‌ణ‌ని మ‌ద్రాస్ న్యాయ‌స్థానం బుధ‌వారానికి వాయిదా వేసింది. ఓ ప‌క్క సినిమా రిలీజ్‌కు టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఈ సినిమాటికెట్‌కు భారీ డిమాండ్ గా పెరిగిపోయింది.

సినిమా రిలీజ్‌కు సెన్సార్ అడ్డంకులు ఏర్ప‌డి రిలీజ్ 9నే ఉంటుందా? లేక 14కు వాయిదా ప‌డుతుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఒక్క టికెట్ రూ.5000 వ‌ర‌కు డిమాండ్ ఏర్పడింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. విజ‌య్ చివ‌రి సినిమా కావ‌డంతో ఈ స్థాయిలో ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో టికెట్స్‌కు డిమాండ్ ఏర్ప‌డింద‌ని, అంత అయినా స‌రే అభిమానుల‌, విజ‌య్ ఫాలోవ‌ర్స్ టికెట్స్ తీసుకోవ‌డానికి ముందుకొస్తున్నార‌ట‌. అక్క‌డ ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన టికెట్ ప్రైజ్ రూ.190. కానీ సినిమాపై ఉన్న క్రేజ్ కార‌ణంగా థియేట‌ర్ వ‌ర్గాలు ఒక్కో టికెట్‌ని బ్లాక్‌లో రూ.3000 నుంచి రూ.5000 వ‌ర‌కు అమ్మేస్తున్నార‌ట‌.

చెన్నైలోని రోహిణి సిల్వ‌ర్‌స్క్రీన్స్ విజ‌య్ సినిమాల‌కు అదొక కంచుకోట‌.ఈ థియేట‌ర్లోనూ భారీగా బ్లాక్ టికెట్‌ల అమ్మ‌కాలు జోరందుకున్నాయ‌ట‌. వెట్రి థియేట‌ర్‌, క‌మ‌లా సినిమాస్ ఒక్కో టికెట్ రేటు రూ.3500 నుంచి రూ.4000 వేలకు అమ్ముతున్న‌ట్టుగా కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో టికెట్‌ల‌కు డిమాండ్ లేద‌ని, ఇదే తొలిసారని థియేట‌ర్ వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. విజ‌య్ గోట్ మూవీ టైమ్‌లోనూ ఇంత డిమాండ్ లేద‌ని, చివ‌రి సినిమా కావ‌డం వ‌ల్లే ఫ్యాన్స్ రికార్డు స్థాయిలో టికెట్‌ల‌కు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, దీంతో ఈ మూవీ టికెట్స్‌కు భారీ డిమాండ్ ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది.

మ‌ద్రాస్ హైకోర్ట్ తీర్పు రిజ‌ర్వ్‌...

మ‌ద్రాస్ హై కోర్టు ఈ కేసుని మంగ‌ళ‌వారం విచారించి బుధ‌వారానికి వాయిదా వేపిన విష‌యం తెలిసిందే. బుధ‌వారం మ‌ధ్యాహ్నం విచార‌ణ జ‌రిగింది. కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్ త‌రుపున ఒక న్యాయ‌వాది, సీబీఎఫ్‌సీ త‌రుపున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ `జ‌న నాయ‌గ‌న్‌`పై త‌మ వాద‌న‌లు వినిపించారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న త‌రువాత జ‌స్టిస్ పీటీ ఆశా తీర్పుని రిజ‌ర్వ్ చేశారు. జ‌న‌వ‌రి 9నే తీర్పు వెలువ‌డే అవ‌కాశం ఉంది. దీంతో సినిమా రిలీజ్ ఆ రోజు ఉంటుందా? ..వాయిదా ప‌డుతుందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Tags:    

Similar News