రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టిన‌ ద‌ళ‌ప‌తి సెల్ఫీ

ద‌ళ‌ప‌తి విజ‌య్ తమిళ‌నాడులో రాజ‌కీయంగా ఎదిగేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు.;

Update: 2025-08-24 03:56 GMT

ద‌ళ‌ప‌తి విజ‌య్ తమిళ‌నాడులో రాజ‌కీయంగా ఎదిగేందుకు త‌న‌వంతు ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. అత‌డు ప్రారంభించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీని అత్యంత‌ వేగంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతూ నిరంత‌రం మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. అత‌డి ప‌బ్లిక్ మీటింగుల‌కు ల‌క్ష‌ల్లో జ‌నం పోటెత్తుతున్నారు. అత‌డి స్పీచ్‌ల‌కు జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. ల‌క్ష‌లాదిగా త‌ర‌లి వ‌స్తున్న‌ జ‌న‌స‌ముద్రాన్ని అదుపు చేసేందుకు త‌మిళ‌నాడు పోలీసులు చాలా శ్ర‌మించాల్సి వ‌స్తోంది. ఇటీవ‌లి కాలంలో ఒక నాయ‌కుడిగా ఈ స్థాయి ఫాలోయింగ్ ఉన్న స్టార్ వేరొక‌రు లేరు అంటే అతిశ‌యోక్తి కాదు.

విజయ్ ఇటీవల మధురైలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయ‌గా, ఈ స‌మావేశానికి రికార్డు స్థాయిలో ఒక కోటి 40ల‌క్ష‌ల మంది (14 మిలియన్ల) ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. విజ‌య్ ఇన్ స్టాలో షేర్ చేసిన రీల్ రికార్డులు బ‌ద్ధ‌లు కొడుతోంది. మూడు రోజుల క్రితం మధురైలో జరిగిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) రెండవ రాష్ట్ర స్థాయి సమావేశం గ్రాండ్ స‌క్సెసైంది. అభిమానుల స‌ముద్రంతో సెల్ఫీ తీసి విజ‌య్ దీనిని షేర్ చేయ‌గా, మాస్ ఫ్యాన్స్ లో ఈ వీడియో అగ్గి రాజేసింది. విజయ్ పోస్ట్‌కు ఒక రోజులోనే కోటి పైగా లైక్‌లు రావడం ఆస‌క్తిని క‌లిగించింది. సుమారు కోటి 40ల‌క్ష‌ల మంది అనుచ‌రులు ఇన్ స్టాలో విజ‌య్ ని అనుస‌రించ‌డం ఆస‌క్తిక‌రం. ఏ దక్షిణ భారత నటుడికి సాధ్యం కాని రికార్డ్ ఇన్‌స్టాలో న‌మోదైంది. ఒకే ఒక్క‌ పోస్ట్‌కు అత్యధిక లైక్‌లు (10.3 మిలియన్లు) సాధించిన నాయ‌కుడిగా రికార్డులు బ్రేక్ చేసాడు విజ‌య్.

విజయ్ ఓవైపు రాజ‌కీయాల్లో బిజీగా ఉన్నా, సినీకెరీర్ ని విడిచిపెట్ట‌లేదు. అత‌డు త‌దుప‌రి `జ‌న నాయ‌గ‌న్` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత నటనకు వీడ్కోలు పలికి 2026 వేసవిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ‌డం కోసం స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్నాడు. అత‌డి రాజ‌కీయ స‌మావేశాల‌కు ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డింది.

Tags:    

Similar News