విజ‌య్ కు మ‌ర్చిపోలేని స‌ర్‌ప్రైజ్ ఇస్తా!

విజ‌య్ త‌న ప్ర‌యాణాన్ని సినిమాల నుంచి రాజ‌కీయాల వైపు మ‌ళ్లించి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకున్నారు.;

Update: 2025-12-12 16:30 GMT

కోలీవుడ్ హీరో ద‌ళ‌పతి విజ‌య్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయ‌న నుంచి ఏదైనా కొత్త సినిమా వ‌స్తుందంటే చాలు ఎప్పుడెప్పుడు ఆ సినిమాను థియేట‌ర్ల‌లో చూస్తామా అని అత‌ని ఫ్యాన్స్ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తుంటారు. అలాంటి విజ‌య్ ఇప్పుడు సినిమాల‌కు స్వ‌స్తి చెప్ప‌నున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న చేస్తున్న జ‌న నాయ‌గ‌న్ సినిమానే ఆఖ‌రి సినిమా అంటున్నారు.

విజ‌య్ ఆఖ‌రి సినిమాగా జ‌న నాయ‌గ‌న్

విజ‌య్ త‌న ప్ర‌యాణాన్ని సినిమాల నుంచి రాజ‌కీయాల వైపు మ‌ళ్లించి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నుకున్నారు. అందులో భాగంగానే ఇకపై సినిమాల‌కు దూరంగా ఉండాల‌ని విజ‌య్ డిసైడ్ అవ్వ‌గా, ఆయ‌న హీరోగా ఆఖ‌రిగా రానున్న సినిమా జ‌న నాయ‌గ‌న్ పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమాకు హెచ్. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

జ‌న‌వ‌రి 9న జ‌న నాయ‌గ‌న్ రిలీజ్

విజ‌య్ ఆఖ‌రి సినిమాగా రూపొందుతున్న జ‌న నాయ‌గ‌న్ సంక్రాంతి కానుక‌గా జన‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విజ‌య్ రాజ‌కీయాల్లోకి వెళ్లాక సినిమాలు మానేస్తార‌నే వార్త ఎంతోమంది అభిమానుల్ని నిరాశ ప‌ర‌చ‌గా, ఈ విష‌యంపై ఇప్ప‌టికే చాలా మంది త‌మ బాధ‌ను వ్య‌క్త పరిచారు. అయితే తాజాగా సౌత్ మ్యూజిక్ సెన్సేష‌న్, జ‌న నాయ‌గ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద‌ర్ ఈ విష‌యంపై మాట్లాడారు.

ఆ విష‌యంలో చాలా బాధ‌గా ఉంది

జ‌న నాయ‌గ‌న్ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ను చాలా భారీగా ప్లాన్ చేశామ‌ని, ఆ ఈవెంట్ లో ఫ్యాన్స్ కు చాలా స‌ర్‌ప్రైజ్‌లుంటాయని, ఓపెన్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న ఈ ఈవెంట్ లో తాను కూడా విజ‌య్ కోసం ఓ స‌ర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేశాన‌ని, అన్నీ బావున్నా ఈ మూవీ ఆయ‌నకు లాస్ట్ ఫిల్మ్ కావ‌డం త‌న‌కు చాలా బాధ‌గా ఉంద‌ని, ఈ ఈవెంట్ లో విజ‌య్ ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేని విధంగా స‌ర్‌ప్రైజ్ చేస్తాన‌ని, ఆ ఈవెంట్ లో విజ‌య్ సినిమాలైన మాస్ట‌ర్, లియో, బీస్ట్ తో పాటూ జ‌న నాయ‌గ‌న్ లోని సాంగ్స్ ను కూడా లైవ్ లో పెర్ఫార్మ్ చేయ‌నున్న‌ట్టు అనిరుధ్ చెప్పారు.

Tags:    

Similar News