నెక్స్ట్ తెలంగాణ కింగ్ దేవరకొండేనా?
ఆ సంగతి పక్కన బెడితే? తర్వాత రిలీజ్ అయ్యే సినిమా `తెలంగాణ కింగ్` అన్న టాక్ అప్పుడే మొదలైంది. ఆ రేంజ్ హీరో తెలంగాణ లో ఎవరు ఉన్నారంటూ డిబేట్లు మొదలయ్యాయి.;
ఇటీవలే రామ్ హీరోగా నటించిన `ఆంధ్రాకింగ్ తాలూకా` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. హిట్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద గళ్లా మాత్రం నిండటం లేదు. ఈనేపథ్యంలో రకరకాల కారణాలు తెరపైకి వస్తున్నాయి. హీరో-అభిమాని మధ్య స్టోరీ కావడంతో ఇతర హీరోల అభిమానులు థియేటర్ కు రావడం లేదని, రామ్ మార్కెట్ డౌన్ అవ్వడం వంటి కారణాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు ఆంధ్రాకింగ్ అనే టైటిల్ కూడా మైనస్ అయిందనే వార్త వినిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్రా-తెలంగాణ రెండు ప్రాంతాలు వస్తాయి.
కానీ సినిమా టైటిల్ ఆంధ్రాకి చెందింది కావడంతో? ఓ సెక్షన్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం లేదన్న రీజన్స్ వినిపి స్తున్నాయి. దీంతో పాటు నవంబర్ అంటే సినిమాలకు అన్ సీజన్ గానూ భావిస్తుంటారు. ఇదీ ఓ కారణంగా మాట్లాడుకుం టున్నారు. మొత్తంగా ఆంధ్రాకింగ్ పై పాజిటివ్ టాక్ వచ్చినా ప్రతికూల వాతావరణ మైతే మార్కెట్ లో కనిపిస్తోంది. లక్కీగా ఈ వారం బాలయ్య `అఖండ 2` రిలీజ్ అవ్వలేదు. ఆ రకంగా రామ్ సినిమాకు కొంత కలిసొస్తుంది. బాలయ్య కూడా రేసులో ఉండి ఉంటే? కలెక్షన్స్ మరింత దారుణంగా పడిపోయేవని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఆ సంగతి పక్కన బెడితే? తర్వాత రిలీజ్ అయ్యే సినిమా `తెలంగాణ కింగ్` అన్న టాక్ అప్పుడే మొదలైంది. ఆ రేంజ్ హీరో తెలంగాణ లో ఎవరు ఉన్నారంటూ డిబేట్లు మొదలయ్యాయి. అలా చూసుకుంటే ఆ టైటిల్ కి అన్ని రకాలుగా అర్హుడు విజయ్ దేవరకొండ. ఇతడు తెలంగాణ ప్రాంతానికి చెందిన వాసే. పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడుతాడు. విజయ్ కి ఆ యాస ఎంతో కలిసొచ్చింది. తాను స్టార్ గా కనెక్ట్ అవ్వడానికి ఆ స్లాంగ్ ప్రధాన కారణం అనొచ్చు. `పెళ్లి చూపులు` కంటెంట్ తో పాటు, విజయ్ స్లాంగ్ వర్కౌట్ అయింది. అందుకే ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది.
ఆ తర్వాత పరిశ్రమలో విజయ్ ఎదిగిన విధానం తెలిసిందే. `అర్జున్ రెడ్డి`, `గీతగోవిందం` లాంటి విజయాలతో సూపర్ స్టార్ అయ్యాడు. విజయ్ తర్వాత తెలంగాణ ప్రాంతం నుంచి అతడి రేంజ్ లో సక్సెస్ అయిన మరో నటుడు కూడా లేడు. నేచురల్ స్టార్ నాని తెలంగాణ నుంచి ఉన్నా? అతడికి ఆంధ్రా మూలాలు న్నాయి. తెలంగాణ స్లాంగ్ లో నాని పెద్ద గా ఫేమస్ కూడా కాలేదు. ఈ నేపథ్యంలో నాని కంటే? ఉత్తమంగా విజయ్ కనిపిస్తున్నాడు. `తెలంగాణ కింగ్` అనే టైటిల్ విజయ్ కి పర్పెక్ట్ గా సూటవుతుందంటున్నారు.