రౌడీ హీరోకు ఈసారి డబుల్ బీట్.. రౌడీ జనార్ధనలో మ్యూజిక్ సంచలనం!

టాలీవుడ్‌లో వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Update: 2026-05-23 09:30 GMT

టాలీవుడ్‌లో వరుస ప్రయోగాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డైరెక్ట‌ర్ ర‌వి కిర‌ణ్ కోలా తెరకెక్కిస్తున్న గ్రామీణ యాక్షన్ డ్రామా రౌడీ జనార్ధనపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ అప్డేట్ సినీ వర్గాల్లో మరింత చర్చకు దారి తీసింది.

రౌడీ జ‌నార్ధ‌న‌ సినిమాకు ఇద్దరు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు కలిసి పనిచేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే మలయాళ బ్లాక్‌బస్టర్ భ్రమయుగంతో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ప్రశంసలు అందుకున్న క్రిస్టో జేవియర్ ఈ సినిమాకు రీరికార్డింగ్ బాధ్యతలు చేపట్టగా, ఇప్పుడు బాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ విశాల్ మిశ్రా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. ఆయన ప్రధానంగా పాటలకు స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం.

సినిమా మేకింగ్‌లో మ్యూజిక్‌కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. ముఖ్యంగా ఇంటెన్స్ యాక్షన్ డ్రామాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథనాన్ని మరోస్థాయికి తీసుకెళ్తుంది. అలాంటి విభాగంలో క్రిస్టో జేవియర్‌కు ఉన్న ప్రత్యేక గుర్తింపు రౌడీ జనార్ధన సినిమాకు ప్లస్ కానుందని భావిస్తున్నారు. మరోవైపు, మెలోడీలతో పాటూ ఎమోషనల్ ట్రాక్స్‌లో తనదైన ముద్ర వేసిన విశాల్ మిశ్రా ఎంట్రీతో ఈ సినిమాలోని సాంగ్స్ పై కూడా అంచనాలు పెరిగాయి. రెండు విభిన్న స్టైల్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లు ఒకే సినిమాకు పనిచేయడం అరుదైన విషయమనే చెప్పాలి. దీంతో ఈ సినిమా ఆడియో పరంగా కూడా ప్రత్యేక అనుభూతిని అందించబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ లుక్, గ్రామీణ నేపథ్యంలోని యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు కొత్త ఫీల్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ చేయాలనే టార్గెట్ తో చిత్రబృందం వేగంగా పనులు కొనసాగిస్తోంది.

ఇదిలా ఉంటే, విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్య‌న్ తెరకెక్కిస్తున్న ర‌ణ‌బాలి ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. ఆ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు రౌడీ జనార్ధన కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటుండటంతో ఈ ఏడాదిలోనే విజయ్ నుంచి రెండు పెద్ద సినిమాలు రావచ్చన్న అంచనాలు అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. ముఖ్యంగా మాస్ యాక్షన్, విలేజ్ బ్యాక్‌డ్రాప్, స్ట్రాంగ్ మ్యూజ‌క్, విజయ్ దేవరకొండ ఎనర్జీ.. ఇవ‌న్నీ కలిసి రౌడీ జనార్ధనను టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలబెడుతున్నాయి.

Tags:    

Similar News