రౌడీ జనార్దన్ ప్లాన్ ఏంటి..?
విజయ్ దేవరకొండ కింగ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. జెర్సీ తర్వాత గౌతం తిన్ననూరి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ హైప్ ఉంది.;
విజయ్ దేవరకొండ కింగ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. జెర్సీ తర్వాత గౌతం తిన్ననూరి నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఈ మూవీపై భారీ హైప్ ఉంది. ఐతే ఈ సినిమా విషయంలో ఆడియన్స్ అంచనాలు తారుమారయ్యాయి. విజయ్ వరకు ఓకే కానీ సినిమాను గౌతం ఫుల్ సాటిస్ఫైడ్ గా తీయడంలో విఫలమయ్యాడు. ఐతే కింగ్ డమ్ తో కమర్షియల్ హిట్ కొట్టాలని చూసిన విజయ్ కి నిరాశ తప్పలేదు. సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అన్న విశ్లేషణలు చేస్తున్నారు. కింగ్ డమ్ కి సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చారు. మరి రిజల్ట్ చూశాక సీక్వెల్ ని తీస్తారా లేదా అన్నది చూడాలి.
రవికిరణ్ కోలా డైరెక్షన్ లో..
ఇక ఇదిలాఉంటే విజయ్ దేవరకొండ నెక్స్ట్ రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్నాడు. రవికిరణ్ కోలా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ జనార్ధన్ సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉంది. ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో లవ్ కం యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఫస్ట్ టైం రాయలసీమ నేపథ్యంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో చేస్తున్న కారణంగానే ఆమధ్య కింగ్ డం ఈవెంట్ తిరిపతిలో జరిగితే చితూరు యాసలో మాట్లాడాడు విజయ్.
ఐతే కింగ్ డ మొదటి షోతో పాజిటివ్ టాక్ తో మొదలైనా చిన్నగా యావరేజ్ టాక్ తెచ్చుకుని ఫైనల్ గా ఫెయిల్యూర్ అటెంప్ట్ అయ్యింది. ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని టాక్. ఐతే ఈ టైంలో రౌడీ జనార్ధన్ మీదే తన హోప్స్ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆల్రెడీ వరుస ఫ్లాపులతో దిల్ రాజు కూడా విజయ్ సినిమా మీదే గురి పెట్టుకుని ఉన్నాడు.
విజయ్ కి పర్ఫెక్ట్ టైటిల్..
విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ ఇటు నిర్మాతకు, అటు హీరోకి ఒక మంచి హిట్ ఇవ్వాలి. ఐతే రౌడీ జనార్ధన్ అప్డేట్స్ విషయంలో మేకర్స్ ఆచి తూచి అడుగులేస్తున్నారు. సినిమా రిలీజ్ ఎప్పుడన్న క్లారిటీ లేదు. చెప్పడానికి అయితే 2026 సమ్మర్ కి తెచ్చే ప్లాన్ ఉందట. రౌడీ జనార్ధన్ విజయ్ కి పర్ఫెక్ట్ టైటిల్. విజయ్ ని మీడియాలో అంతా కూడా రౌడీ బోయ్ అనేస్తారు. అంతేకాదు విజయ్ దేవరకొండ కూడా తన ఫ్యాన్స్ ని రౌడీస్ అని పిలుస్తాడు. విజయ్ దేవరకొండ క్లాత్ బ్రాండ్ నేం కూడా రౌడీనే. సో ఇన్ని కలిసి వచ్చేలా టైటిల్ ఉంది కాబట్టి సినిమాకు ఇది కలిసి వచ్చే అంశమే అని చెప్పొచ్చు.
విజయ్ దేవర కీర్తి సురేష్ చేసిన మహానటి సినిమాలో నటించాడు. కానీ కీర్తి సురేష్ తో సీన్స్ లేవు. ఐతే రౌడీ జనార్ధన్ లో ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఈ సినిమానే కాదు దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న ఎల్లమ్మ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.