విజయ్ దేవరకొండ డెంగ్యూ.. అసలు విషయం ఇది..!
కింగ్ డమ్ హీరో విజయ్ దేవరకొండ ఆ సినిమా రిలీజ్ ఈ నెల 31న ఉండగా ఈ టైం లో అతనికి డెంగ్యూ ఎటాక్ అయినట్టు తెలుస్తుంది.;
కింగ్ డమ్ హీరో విజయ్ దేవరకొండ ఆ సినిమా రిలీజ్ ఈ నెల 31న ఉండగా ఈ టైం లో అతనికి డెంగ్యూ ఎటాక్ అయినట్టు తెలుస్తుంది. డెంగ్యూతో బాధపడుతున్న విజయ్ ని హాస్పిటల్ కి వెళ్లి సంబంధించిన టెస్ట్ లు చేయించుకున్నారట. అంతేకాదు హాస్పిటల్ నుంచి విజయ్ ఇంటికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఐతే ఈ నెల ఆఖరికి కింగ్ డమ్ రిలీజ్ ఉండగా ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సిన ఈ టైం లో విజయ్ దేవరకొండకి డెంగ్యూ రావడం వల్ల ఈ ఎఫెక్ట్ ప్రమోషన్స్ మీద పడుతుందా అన్న టెన్షన్ ఫ్యాన్స్ లో ఉంది.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాను గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. కింగ్ డమ్ సినిమాలో విజయ్ సరసన భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించింది. సినిమాలో విజయ్, భాగ్య శ్రీ పెయిర్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందించేలా ఉంది.
కింగ్ డమ్ సినిమాకు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన రెండు సాంగ్స్ ఆడియన్స్ ని అలరించాయి. కింగ్ డమ్ సినిమా టీజర్ తోనే సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండకి ఇన్నాళ్లకు కరెక్ట్ సినిమా పడిందని టీజర్ చూసి అనుకున్నారు. అంతేకాదు నెక్స్ట్ వస్తున్న ప్రమోషనల్ కంటెంట్ కూడా కింగ్ డమ్ మీద అంచనాలు మరింత పెంచుతుంది. కింగ్ డమ్ రిలీజ్ మరో రెండు వారాలు ఉన్న ఈ టైం లో విజయ్ దేవరకొండ హెల్త్ కాస్త డిస్టర్బ్ అయ్యిందని అంటున్నారు. ఐతే డెంగ్యూ తో హాస్పిటల్ లో చేరిన విజయ్ ఆల్రెడీ ఇంటికి వచ్చేశారట.
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాను మేకర్స్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో రెండో భాగానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వస్తుందని ఆ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయని తెలుస్తుంది. కింగ్ డమ్ సినిమా మీద విజయ్ దేవరకొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సినిమాలో విజయ్ ఇంటెన్షన్ యాక్టింగ్ ఇన్నేళ్ల అతని ఫ్యాన్స్ ఆకలి తీర్చేస్తుందని చిత్ర యూనిట్ బలంగా చెబుతున్నారు.