రణబాలి కొత్త తరహా ప్రమోషన్ వర్కౌట్ అవుతోంది..!
విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం 'రణబాలి'.
విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం 'రణబాలి'. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 16, 2026న భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ ప్రమోషన్‌పై దృష్టి పెట్టారు. ఒకవైపు సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే మరో వైపు సినిమా ప్రమోషన్‌ను కొత్త తరహాలో చేస్తున్నారు. ఈ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించినట్లు దర్శకుడు చెబుతున్నాడు. ఇండియాలో బ్రిటీష్ వారి పరిపాలన ఉన్న సమయంలో ఒక టైమ్ పీరియడ్‌లో ఎదురైన కరువు పరిస్థితులను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు దర్శకుడు మొదటి నుంచి చెబుతున్నాడు. ఇప్పటి వరకు ఈ పాయింట్‌ను ఏ సినిమాలోనూ టచ్ చేయలేదని, చరిత్రలోనూ పెద్దగా ఆ భయంకరమైన కరువు గురించి చెప్పలేదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ రణబాలి సినిమా ప్రమోషన్...
రణబాలి సినిమాను జనాల్లోకి విభిన్నంగా తీసుకు వెళ్లేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచే విధంగా టీజర్, పోస్టర్స్ ను వదిలారు. ఇప్పుడు అంచనాలు మరింతగా పెంచేందుకు గాను Never Forget the Truth అనే పేరుతో నాలుగు ఎపిసోడ్స్ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ డాక్యుమెంటరీ సిరీస్‌లో రెండు ఎపిసోడ్స్ వచ్చాయి. ఆ రెండు ఎపిసోడ్స్‌లో బ్రిటీష్ వారి కాలంలో ఇండియా ఎలా నష్టపోయింది, బ్రిటీష్ వారు రైల్వేను ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయాలను చర్చించడం జరిగింది. రణబాలి టీం నుంచి వస్తున్న డాక్యుమెంటరీకి మంచి స్పందన లభిస్తోంది. ఎన్నో తెలియని విషయాలను తెలుసుకుంటున్నామని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమా ప్రమోషన్ కోసం డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకు రావడం అనేది సరికొత్త ఐడియా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Never Forget the Truth డాక్యుమెంటరీ సిరీస్...
డాక్యుమెంటరీతో సినిమాకు కావాల్సినంత రీచ్ వస్తుంది, అంతే కాకుండా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సిరీస్‌లో రెండు ఎపిసోడ్స్ వచ్చాయి, మిగిలిన రెండు ఎపిసోడ్స్ విడుదలైన తర్వాత రణబాలి గురించి కచ్చితంగా దేశ వ్యాప్తంగా మరింత చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ కావాలనే ఉద్దేశంతో డాక్యుమెంటరీని ఇంగ్లీష్‌లో చేయడం జరిగింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్ ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితులు, ఇబ్బందులను గురించి వివరించడం జరిగింది. రెగ్యులర్ ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూల కంటే ఇలాంటి సిరీస్ వీడియోలు సినిమాకు మంచి హైప్ తీసుకు వస్తాయని విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రణబాలి కొత్త తరహా ప్రమోషన్ బాగానే వర్కౌట్ అవుతుంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రొమాన్స్...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. అయితే ఇప్పుడు భార్య భర్తలు కావడంతో రణబాలి స్పెషల్ మూవీగా నిలిచింది. విజయ్, రష్మిక పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో అభిమానులతో పాటు అన్ని వర్గాల వారిలోనూ అంచనాలు, ఆసక్తి పెరిగింది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ సైతం సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. సాధారణంగానే రష్మి, విజయ్‌లు కలిసి నటిస్తున్నారు అంటే అంచనాలు ఉంటాయి, అలాంటిది పాటలో చూపించినట్లు రొమాంటిక్ సీన్స్ ఉంటే సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఖాయం అని సోషల్ మీడియా టాక్. విజయ్ దేవరకొండ హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. సాలిడ్ కమర్షియల్ హిట్ కొట్టి, తన మార్క్ ను చూపించాలని ఆరాట పడుతున్నాడు. మరి ఆ హిట్ రణబాలితో సాధ్యం అయ్యేనా చూడాలి.