ఏందయ్యా సామీ పాటతో ఫిదా చేసిన పోలీస్ ఆఫీసర్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా సినిమా రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.;
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న తాజా సినిమా రణబాలి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఆయన రూపొందించిన ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఈసారి కూడా వినూత్న కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆయన ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని అజయ్- అతుల్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఎందయ్య సామీ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ పాటపై రీల్స్, కవర్ సాంగ్స్ విపరీతంగా వైరలవుతున్నాయి. అదే క్రమంలో ఈ తెలంగాణ పోలీస్ అధికారిణి పాడిన వెర్షన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె గాత్రంలో ఉన్న స్వచ్ఛత, భావవ్యక్తీకరణ ఈ సాంగ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ మహిళా అధికారి తన మధుర గానంతో సోషల్ మీడియాలో ఈ సాంగ్ తో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఆమె పాడిన ఏందయ్య సామీ సాంగ్ వినే వారిని మంత్ర ముగ్ధులను చేస్తోంది. రంగబాలి సినిమాలోని ఆ మెలోడీకి ఆమె ఇచ్చిన స్వర రాగం మరింత భావోద్వేగాన్ని జోడించింది. పోలీస్ యూనిఫామ్‌లోనే ఎంతో సహజంగా, ఎలాంటి ఆర్భాటం లేకుండా పాడిన ఆమె గానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది.
ఇక ఈ వీడియోపై పలువురు ప్రముఖులు కూడా స్పందిస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. విధి నిర్వహణలో కఠినంగా కనిపించే పోలీస్ ఉద్యోగంలో ఇంత మృదువైన కళాత్మక కోణం కూడా ఉందని ఈ వీడియో నిరూపించిందని అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోకు లక్షల వ్యూస్, వేల లైక్స్ రావడం గమనార్హం. చాలా మంది ఆమెను అభినందిస్తూ, టాలెంట్‌కు యూనిఫామ్ అడ్డంకి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు రణబాలి సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక జంటగా నటిస్తున్న మొదటి సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రిలీజైన ఏందయ్యా సామీ సాంగ్ సినిమాకు మంచి హైప్ తీసుకువచ్చింది. ఇప్పుడదే పాటను ఒక పోలీస్ అధికారిణి తన గాత్రంతో మరోసారి ట్రెండ్ చేయడం విశేషం. మొత్తానికి, ఒక సాధారణ వీడియోగా మొదలైన ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ సెన్సేషన్‌గా మారింది.