గీత గోవిందం కి ముందే ప్రేమ మొదలైందా...?
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమ వ్యవహారం ఇంకా సీక్రెట్‌గానే ఉన్నప్పటికీ అందరికీ తెలిసి ఓపెన్ సీక్రెట్‌గా మారి పోయింది.;
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమ వ్యవహారం ఇంకా సీక్రెట్‌గానే ఉన్నప్పటికీ అందరికీ తెలిసి ఓపెన్ సీక్రెట్‌గా మారి పోయింది. ఇటీవల రష్మిక మందన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అందరూ రౌడీ స్టార్ అంటూ అరుస్తున్న సమయంలో అందరికీ తెలిసిందే అన్నట్లుగా వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా వీరిద్దరి మ్యారేజ్ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందనే విషయం కూడా బయటకి వచ్చింది. ఇద్దరూ పలు సందర్భాల్లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు, కొన్ని సార్లు వారే కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చాలా సార్లు వారు ప్రేమ విషయంను చెప్పకనే చెబుతూ వచ్చారు. కొందరు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, కొందరు మాత్రం అదేం లేదు అన్నట్లుగా అనుకుంటూ వచ్చారు. తీరా ఇప్పుడు చూస్తే గతంలో జరిగిన విషయాలు అన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే చాలా సార్లు ఈ విషయంకు సంబంధించి లీక్‌లు వచ్చాయి అనిపించింది.
ఒక రిసార్ట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఒకే పూల్ లో ఉన్నారు. అయితే విడి విడిగా సింగిల్ ఫోటోలను వారు షేర్ చేశారు. ఆ ఫోటోలను మ్యాచ్ చేసిన సమయంలో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. దాంతో చాలా మంది విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమలో ఉన్నారు ఇదే సాక్ష్యం అన్నట్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేశారు. అయితే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ముదిరింది డియర్ కామ్రేడ్ సమయంలో అని అంతా అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే గీత గోవిందం సినిమా నుంచే ఇద్దరి మధ్య కనెక్షన్ క్రియేట్ అయింది . గీత గోవిందం షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అని గతంలో వచ్చిన బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో క్లిప్స్ ను చూస్తే అర్థం అవుతుంది. యానిమల్ ప్రమోషన్ సమయంలో బాలకృష్ణ టాక్ షో లో రష్మిక మందన్న, రణబీర్ కపూర్ పాల్గొన్నారు. అదే షో లో సందీప్ వంగ పాల్గొనారు, విజయ్ దేవరకొండకు ఫోన్ చేయడం జరిగింది.
బాలయ్య షో లో రణబీర్ కపూర్ కామెంట్స్
ఆ షో లో యానిమల్, అర్జున్ రెడ్డి పోస్టర్‌లను పెట్టినప్పుడు రెండు సినిమాలు తనకు చాలా ముఖ్యం అన్నట్లుగా చెప్పింది. యానిమల్ సినిమాలో నేను నటించాను కనుక ఇష్టం కాగా, అర్జున్ రెడ్డితో ఉన్న కనెక్షన్ కారణంగా ఆ సినిమా ఇష్టం అన్నట్లుగా చెప్పింది. రణబీర్ కపూర్ ఆ సమయంలో రష్మికను ఇరికించే విధంగా ఏంటి ఆ కనెక్షన్ అనడంతో హైదరాబాద్‌కి షిప్ట్ అయిన సమయంలో నేను మొదటగా చూసిన సినిమా అర్జున్ రెడ్డి, అందుకే ఆ సినిమా చాలా స్పెషల్ అన్నట్లుగా రష్మిక చెప్పింది. అప్పుడే రణబీర్ కపూర్ కల్పించుకుని... రష్మికను మా దర్శకుడు సందీప్ మొదటి సారి అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ వేడుక విజయ్ దేవరకొండ ఇంటి మీద జరిగినప్పుడు కలిశాడు అని చెప్పాడు. అంటే అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీకి రష్మికను విజయ్ ఆహ్వానించాడు. అప్పుడే గీత గోవిందం షూటింగ్ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ స్టోరీ..
గీత గోవిందం సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది అనేందుకు రణబీర్ వ్యాఖ్యలు సాక్ష్యం అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అర్జున్ రెడ్డి సినిమా సక్సెస్ పార్టీకి హాజరు కావడంకు కారణం విజయ్ దేవరకొండపై ఆమెకు ఉన్న ప్రేమ అనే వాదన వినిపిస్తోంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ బెస్ట్ టాలీవుడ్ కపుల్‌గా నిలవడం ఖాయం అని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ చాలా స్పెషల్‌గా ఉంటుంది అనే విశ్వాసంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వీరిద్దరు కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. మరోసారి వీరి కాంబోలో సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.