• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ మ‌ళ్లీ మ్యాజిక్...

రౌడీ మ‌ళ్లీ మ్యాజిక్ చేసేలా ఉన్నాడే!

| `అర్జున్‌రెడ్డి` మూవీతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి స్టార్‌లా దూసుకొచ్చిన సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

By - Tupaki Desk
Update: 2025-05-02 11:30 GMT

`అర్జున్‌రెడ్డి` మూవీతో ఒక్క‌సారిగా లైమ్‌లైట్‌లోకి స్టార్‌లా దూసుకొచ్చిన సంచ‌ల‌నం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ మూవీతో దేశ వ్యాప్తంగా విజ‌య్‌కి ద‌క్కిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. బాలీవుడ్‌లోనూ భారీ క్రేజ్‌ని సొంతం చేసుకున్న విజ‌య్ `లైగ‌ర్‌`తో పాన్ ఇండియా ట్రై చేసి అట్ట‌ర్ ఫ్లాప్‌ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చాడు. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ని న‌మ్మి మూడేళ్లు శ్ర‌మించి చేసిన `లైగ‌ర్‌` డిజాస్ట‌ర్ అనిపించుకోవ‌డంతో విజ‌య్ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యాడు.

అప్ప‌టి నుంచి త‌న పంథాకు భిన్నంగా సైలెంట్ అయిపోయాడు. కొత్త ప్రాజెక్ట్‌ల‌తో మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ కావాల‌నే ప‌ట్టుద‌ల‌తో సైలెంట్‌గా కొత్త సినిమాలు చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ `కింగ్‌డ‌మ్‌`. జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ భారీ మూవీని నిర్మిస్తున్నారు. టీజ‌ర్‌తో అంచ‌నాల్ని పెంచేసిన ఈ మూవీ ఈ నెల 30న పాన్ ఇండియా వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమాతో ఎలాగైనా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకోవాల‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ ప్రాజెక్ట్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్నాడు. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో `కింగ్‌డ‌మ్‌` ఉంటుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. టీజ‌ర్ కూడా ఆస‌క్తిని రేకెత్తించ‌డంతో సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇందులో భాగ్య‌శ్రీ బోర్సే విజ‌య్‌కి జోడీగా న‌టిస్తోంది. `మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌`కు సెట‌రాఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన భాగ్య‌శ్రీ బోర్సే కింగ్‌డ‌మ్‌ని త‌న గ్లామ‌ర్‌తో హీటెక్కించేస్తోంది.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాంగ్ ప్రోమోని విడుద‌ల చేశారు. `హృద‌యం లోప‌ల‌` అంటూ సాగే ఈ పాట‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య‌శ్రీ బోర్సే లిప్ లాక్ లాగించేసి మ‌ళ్లీ `అర్జున్‌రెడ్డి` డేస్‌ని గుర్తు చేశారు. దీంతో నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. `కింగ్‌డ‌మ్‌`తో రౌడీ స్టార్ మ‌ళ్లీ ట్రాక్‌లోకి వ‌చ్చేస్తున్నాడ‌ని, ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకోవ‌డం ఖాయ‌మ‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. త‌న‌దైన మార్కు రొమాన్స్‌తో విజ‌య్‌దేవ‌ర‌కొండ మ‌రో సారి మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్‌.

Tags:    
  • VijayDeverakonda 
  • KingdomTeaser 
  • PanIndiaMovie 
  • BhagyashreeBorse 
  • Tollywood 
  • KingdomMovie 
  • GowtamTinnanuri 

Similar News

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

రాజమౌళి వచ్చాక ఇంటర్వెల్ సీన్స్ మారిపోయాయా? ఇంతకీ ఆయన ఏం చేశాడు...

2026-11-04 17:30 GMT

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS