కింగ్ డమ్ - బాక్సాఫీస్ నుంచి ఎంత రావాలి?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు.;

Update: 2025-07-28 08:07 GMT

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కెరీర్‌లో చాలా కీలకమైన దశలో ఉన్నాడు. వరుసగా వచ్చిన ‘లైగర్’, ‘ఖుషి’, ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో, అతడి మీద ఉన్న ప్రెజర్ పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు "కింగ్ డమ్" సినిమాతో మంచి హిట్ కొట్టాలని విజయ్ తహతహలాడుతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీపై ఇండస్ట్రీలోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా థ్రిల్లింగ్ జైలు డ్రామా, స్పై యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్లు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి మరింత పెరిగిపోయింది. అలా ప్రతి చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకుండా టీమ్ మొత్తం ప్రమోషన్ల కోసం సమాయత్తమవుతోంది.

విజయ్ తన గత ఫ్లాప్స్‌ను మర్చిపోయేలా, ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే జూలై 31న గ్రాండ్‌గా విడుదలకి ప్లాన్ చేస్తున్నారు. థియేటర్ బిజినెస్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కూడా మంచి ధరలకు అమ్ముడయ్యాయి. ఇక బాక్సాఫీస్ టార్గెట్ విషయానికి వస్తే, "కింగ్ డమ్" సుమారు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లక్ష్యంతో బరిలో దిగుతోంది. అంటే, సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే కనీసం 55 కోట్లకు పైగా షేర్ రావాలి.

ప్రీ రిలీజ్ బిజినెస్ లిస్ట్

నైజాం: రూ. 15 కోట్లు

సీడెడ్: రూ. 6 కోట్లు

ఆంధ్రా: రూ. 15 కోట్లు

కర్ణాటక + ఇతర రాష్ట్రాలు: రూ. 3.5 కోట్లు

ఓవర్సీస్: రూ. 10 కోట్లు

ఇతర డబ్బింగ్ వెర్షన్లు: రూ. 4 కోట్లు

రావాల్సిన గ్రాస్ - రూ. 100కోట్లు

ట్రేడ్ పండితుల అంచనాల ప్రకారం, సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే, డే వన్ నుంచే మంచి టాక్ రావాలి. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, మాస్ ప్రేక్షకులు కలిసి సినిమా దగ్గరకు వస్తేనే బాక్సాఫీస్ వద్ద విజయం సాధించగలుగుతుంది. అంతేకాదు, ప్రస్తుతం కింగ్ డమ్‌కు ఓపెన్ గ్రౌండ్ దొరకడం మరో ప్లస్. తదుపరి రెండు వారాలపాటు పెద్దగా ఎలాంటి పోటీ లేకపోవడం వల్ల సినిమాకు కలెక్షన్ల పరంగా మంచి స్పేస్ దక్కనుంది.

అయితే ఆగస్ట్ 14 నుంచి ‘కూలీ’, ‘వార్ 2’ లాంటి భారీ ప్రాజెక్టులు రిలీజవుతున్నందున, అప్పటి వరకూ వీలైనంత వసూళ్లు రాబట్టుకోవాల్సిన బాధ్యత సినిమా టీమ్ మీదే ఉంది. మౌత్ టాక్ క్లిక్కయితే వంద కోట్ల గ్రాస్ టార్గెట్ చేరడం పెద్ద విషయమే కాదు. ఇక సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండటంతో, అక్కడి నుండి వచ్చే హైప్‌తో సినిమాకు మరింత బజ్ పెరుగుతుందని టీమ్ ఆశిస్తోంది. మరి విజయ్ దేవరకొండ ఈసారి సాలిడ్ హిట్ కొడతాడా లేదా అనేది చూడాలి.

Tags:    

Similar News