కింగ్డమ్ ఓటీటీ స్ట్రీమింగ్.. ఇది అస్సలు ఊహించలేదే!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్నేళ్లుగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ కు ఈ సినిమా కాస్త ఉపశమనం కలిగించింది.;
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఇటీవల కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొన్నేళ్లుగా ఫ్లాప్ లతో సతమతమవుతున్న విజయ్ కు ఈ సినిమా కాస్త ఉపశమనం కలిగించింది. జులై 24న రిలీజైన ఈ సినిమాకు మంచి టాకే వచ్చింది. కానీ మొదటి వీకెండ్ లో మంచి విజయాన్ని సాధించిన తర్వాత సినిమా ఫేడ్ అయిపోయింది. అలా సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్లు రాబట్టడంలో, థియేటర్ లో అక్యూపెన్సీ రన్ చేయడంలో విఫలమైంది.
ఫలితంగా కింగ్డమ్ మంచి సినిమా అయినప్పటికీ.. నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక నిన్న స్పెషల్ డే వినాయక చవితి సందర్భంగా కింగ్డమ్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లిక్స్ లో సినిమా చూసిన నెటిజన్లు, ప్రేక్షకుల నుండి కింగ్డమ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో కంటే ఓటీటీలోనే స్పందన ఎక్కువగా ఉంది.
దీంతో కింగ్డమ్ సినిమాను ప్రేక్షకులు థియేటర్లలో లాంగ్ రన్ చేయడంలో ఎక్కడ విఫలమైందో అర్థం అవ్వట్లేదని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తమతమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. వారిలో కొందరు కింగ్డమ్ సినిమా కథ వేరేలా ఉంటే.. మేకర్స్ మాత్రం ఇంకోలా ప్రమోట్ చేశారని వ్యాఖ్యానించారు.
మరికొందరు సినిమాకు పేలవమైన ప్రమోషన్లు చేశారని, ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయలేదని నిర్మాతలపై విమర్శలు గుప్పించారు. ఎప్పటిలాగే వారిలో కొందరు హీరో విజయ్ దేవరకొండను కూడా ట్రోల్ చేయగా, చాలా మంది అతని నటనను ప్రశంసించారు. కింగ్డమ్ లో నటుడిగా విజయ్ దేవరకొండ చాలా మెరుగుపడ్డాడని ప్రశంసిస్తున్నారు.
కాగా, ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కింది. భాగ్య శ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ స్టార్ నటుడు సత్యదేవ్.. విజయ్ కు అన్న పాత్రలో నటించారు. సినిమా క్లైమాక్స్ లో సినిమా సీక్వెల్ ఉండనున్నట్లు హింట్ ఇచ్చారు. ఒకవేళ సీక్వెల్ ఉంటే ఈసారైనా.. సరైనా ప్రమోషన్స్ చేయాలని అంటున్నారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.