కింగ్‌డమ్ మ్యూజిక్ పై అప్డేట్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా కింగ్‌డమ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.;
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా కింగ్‌డమ్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ చాలా కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్‌కు, రీసెంట్ గా రిలీజైన ఇంటెన్స్ టైటిల్ టీజర్ కు ఆడియన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాలోని ఓ సాంగ్ షూట్ కోసం హీరో హీరోయిన్ శ్రీలంక వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు కింగ్‌డమ్ మ్యూజిక్ గురించి సోషల్ మీడియాలో ఓ అప్డేట్ వినిపిస్తోంది. కింగ్‌డమ్ లో మొత్తం మూడు ఫోటోలున్నాయని అంటున్నారు. అనిరుధ్ ఈ సినిమా కోసం కేవలం మూడు పాటలను మాత్రమే కంపోజ్ చేశాడని, ఆ మూడు పాటలూ నెక్ట్స్ లెవెల్ లో ఉండనున్నాయని, ఆ మూడింటిలో ఒక సాంగ్ లవ్ సాంగ్ అని ఆల్రెడీ లీకులందాయి.
కింగ్‌డమ్ నుంచి మొదటి సాంగ్ ను వచ్చే వారం రిలీజ్ చేయనున్నారు మేకర్స్. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని చిత్ర యూనిట్ చెప్తోంది. ఆల్రెడీ గౌతమ్ తో అనిరుధ్ జెర్సీ సినిమాకు వర్క్ చేశాడు. ఆ సినిమా మ్యూజిక్‌కు, బీజీఎం గురించి ఇప్పటికీ అందరూ చాలా స్పెషల్ గా చెప్పుకుంటారు. ఇప్పుడు కింగ్‌డమ్ కు కూడా అనిరుధ్ అలాంటి మెమొరబుల్ మ్యూజిక్కే ఇవ్వనున్నాడంటున్నారు.