కింగ్‌డమ్ సెన్సార్.. VD పవర్‌పుల్ రీటర్న్‌కి రెడీ!
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కింగ్‌డమ్ జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది.;
విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కింగ్‌డమ్ జూలై 31న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌తో సినిమా మీద యూత్ లో భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫుల్ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ కూడా త్వరలో విడుదల కాబోతోంది.
సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం, కింగ్‌డమ్ సినిమా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు సినిమా చూసి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. అంటే కుటుంబ సభ్యులతో కలిసి కూడా సినిమాను థియేటర్‌లో చూసేందుకు అవకాశం ఉంటుంది కానీ, ఇందులో కొన్ని యాక్షన్ సీన్స్, ఇన్‌టెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది.
యు/ఏ సర్టిఫికెట్ రావడం వల్ల సినిమాకు మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రాగలుగుతారు. యాక్షన్ ఎపిసోడ్స్ బోలెడంత ఉండే ఈ సినిమాకు మేకర్స్ నెమ్మదిగా ప్రమోషన్స్ పెంచుతున్నారు. సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ ను పూర్తిగా మార్చుకుని, మాస్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకే ప్రత్యేక హైలైట్.
ఈ సినిమాలో విజయ్ మాస్ యాక్షన్ పర్ఫామెన్స్‌తో పాటు, అతని పవర్‌ఫుల్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కి కొత్తగా కనిపించనున్నాయి. కథన పరంగా కూడా డిఫరెంట్ ట్రాక్ తో రావడంతో యూత్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో సినిమా మీద పాజిటివ్ బజ్ నెలకొంది. కథలో ట్విస్ట్‌లు, ఎమోషనల్ బ్యాలెన్స్‌తో పాటు స్టైలిష్ మేకింగ్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లనున్నాయి.
దర్శకుడు గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఎంత కష్టపడ్డారో మేకింగ్ విధానం చూస్తేనే అర్థమవుతోంది. మొత్తానికి, “కింగ్‌డమ్” సినిమాకు పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. జూలై 31న కింగ్‌డమ్ థియేటర్లలో విడుదల కానుండటంతో, ఈసారి విజయ్‌కు ఖచ్చితంగా బిగ్ హిట్ పడేలా కనిపిస్తోంది. సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.