రౌడీ 'కింగ్డమ్‌' రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

విజయ్‌ దేవరకొండ గత చిత్రం ఫ్యామిలీ స్టార్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. గత ఏడాదిలో విడుదల అయిన ఫ్యామిలీ స్టార్‌ అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది.;

Update: 2025-06-05 11:02 GMT

విజయ్‌ దేవరకొండ గత చిత్రం ఫ్యామిలీ స్టార్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేదు. గత ఏడాదిలో విడుదల అయిన ఫ్యామిలీ స్టార్‌ అభిమానులను తీవ్రంగా నిరాశ పరచింది. మరో గీత గోవిందం రేంజ్‌లో ఆడుతుందని ఆశించిన ఫ్యామిలీ స్టార్‌ సినిమా ఫ్లాప్‌ కావడంతో విజయ్ దేవరకొండ తదుపరి సినిమా విషయంలో ఆచితూచి వ్యవహరించాడు. పలువురు దర్శకులు కథలు చెప్పినప్పటికీ గౌతమ్‌ తిన్ననూరి చెప్పిన కథ విన్న తర్వాత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్డమ్‌' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ సినిమా చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతున్న సినిమా కావడంతో మినిమం గ్యారెంటీ అనే విశ్వాసం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో సినిమా అంటే వాయిదాలు పెద్దగా ఉండవు, అనుకున్న సమయంకు విడుదల చేస్తారు. నిర్మాత నాగవంశీ చాలా క్లీయర్‌గా సినిమా మేకింగ్‌ విషయంలో ఉంటారు. దర్శకులతో చక్కగా పని చేయించుకుంటాడు అంటారు. అలాంటి కాంబోలో రూపొందుతున్న కింగ్డమ్‌ విషయంలో కొన్ని అనుమానాలు, పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. సినిమా ఔట్‌ పుట్‌ విషయంలో అసంతృప్తి కారణంగా ఆలస్యం అవుతుంది అనే వార్తలు వస్తున్నాయి.

మొన్నటి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేశాం, విడుదలకు సిద్ధం అంటూ రిలీజ్‌ డేట్‌ను సైతం అనౌన్స్ చేశారు. జులై మొదటి వారంలో సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కొన్ని కారణాలు ఏంటి అనే విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల ఔట్‌ పుట్‌ విషయంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు చెందిన కీలక వ్యక్తి అసంతృప్తి వ్యక్తం చేశాడని, అందుకే ఆ సీన్‌ను రీ షూట్‌ చేసేందుకు గాను సినిమా విడుదల వాయిదా వేశారనే గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

సినిమా అన్నప్పుడు రీ షూట్స్‌, విడుదల వాయిదాలు కామన్‌. కానీ సినిమా విడుదల తేదీ ఫిక్స్ చేసిన తర్వాత రీ షూట్‌ చేయడం కోసం విడుదల వాయిదా వేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇప్పటి వరకు సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్న అభిమానుల అసహనం మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ ను దాదాపు ఏడాది పాటు ఈ సినిమా కారణంగా బ్లాక్ చేశారని, ఆయన మరే సినిమాను చేయకుండా చేశారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి సినిమా విడుదల వాయిదా పడటంతో పాటు, రీ షూట్‌ అంటున్న కారణంగా మరో రెండు మూడు నెలల వరకు కింగ్డమ్‌ సినిమా విడుదల ఉండదేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News