విజయ్ దేవరకొండ మీద నెగటివిటి పోయిందా?
హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏకంగా స్టార్ హీరోగా మారాడు. ఇదంతా ఎవరి కోసమో ఇప్పటికే అర్థమైపోయింటుంది. ఆయనే విజయ్ దేవరకొండ.;
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదు.. కానీ సినిమాల్లో నటించాలనే తపన.. అనేక మంది హీరోల్లాగే నిర్మాతల చుట్టూ తిరిగాడు. హీరోగానే కాదు.. ఏ రోల్ అయినా చేస్తానని ఫిక్స్ అయ్యాడు. వచ్చిన చిన్న పాత్రలు వదులుకోకుండా నటించాడు. కట్ చేస్తే.. హీరోగా ఎంట్రీ ఇచ్చి తక్కువ టైమ్ లోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఏకంగా స్టార్ హీరోగా మారాడు. ఇదంతా ఎవరి కోసమో ఇప్పటికే అర్థమైపోయింటుంది. ఆయనే విజయ్ దేవరకొండ.
మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు విజయ్. ఓ రేంజ్ లో క్రేజ్ దక్కించుకుని దూసుకుపోతున్న ఆయన.. ప్రస్తుత యూత్ కు బ్రాండ్ ఐకాన్ గా మారారు. వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ సందడి చేస్తున్న విజయ్.. ఇప్పుడు వివిధ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దేవరకొండ బాయ్.. ఇప్పుడు మరో రెండు బడా సినిమాల్లో నటిస్తున్నారు.
నువ్విలా సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన విజయ్.. ఫస్ట్ రెండు చిత్రాలతో ఎలాంటి గుర్తింపు సంపాదించుకోలేదు. ఆ తర్వాత నాని ఎవడే సుబ్రహ్మణ్యం మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డారు. పెళ్లి చూపులు మూవీతో హీరోగా మారిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ హిట్ ను సొంతం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సినిమాల్లో నటిస్తూ ఫుల్ గా సందడి చేస్తున్నారు.
అదే సమయంలో విజయ్ లో ఇప్పుడు చాలా ఛేంజ్ వచ్చిందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ మధ్య డౌన్ టు ఎర్త్ లో మాట్లాడుతున్నారనే చెప్పాలి. నిజానికి.. విజయ్ కు సోషల్ మీడియా లో కాస్త నెగిటివిటీ ఉండేది. యాటిట్యూడ్ సహా వివిధ విషయాల్లో ట్రోల్స్ వచ్చేవి. కొంతమంది ఆడియన్స్, నెటిజన్లు.. ఆయనను చాలా విమర్శించేవారు. విజయ్ కు యాటిట్యూడ్ ఎక్కువగా ఉందనే అనేవారు. లైగర్ టైమ్ లో అది చాలా కనిపించింది.
యాంటీ ఫ్యాన్స్ కూడా క్రియేట్ అయ్యారు. నిజానికి యాటిట్యూడ్ కాదు అది.. విజయ్ ఎప్పుడూ హానెస్ట్ గా మాట్లాడుతుంటారు. తనకు ఏం అనిపిస్తే అదే బయటకు వ్యక్తపరుస్తారు. మనసులో అనిపించిందే.. ఆయన నోటి నుంచి మాట రూపంలో బయటకు వస్తుంది. దీంతో చాలా నెగిటివిటీ వచ్చేది. అయితే ఆ విషయంలో విజయ్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారో లేక మరేం జరిగిందో తెలియదు గానీ.. ఇప్పుడు చాలా మార్పు కనిపిస్తుందనే చెప్పాలి.
ఇప్పుడు కూడా తనకు అనిపించింది మాట్లాడుతున్నా.. అది డౌన్ టు ఎర్త్ గానే ఉంటుంది. మీడియా ముందుకు వచ్చినా, ఏ ఈవెంట్స్ లో అయినా కాస్త డిఫరెంట్ గానే కనిపిస్తున్నారు. యాటిట్యూడ్ అని విమర్శించిన వారి నోళ్లు మూయిస్తున్నారు. ప్రజలకు బాగా చేరువయ్యారు. వాళ్లు కూడా విజయ్ ను బాగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు. యాటిట్యూడ్ కాదు.. కేవలం సూటిగా ఏది అనిపిస్తే అదే విజయ్ మాట్లాడుతారని తెలుసుకున్నారు.
దీంతో ఇప్పుడు విజయ్ పై ఉన్న నెగిటివిటీ పోయినట్టు కనిపిస్తుంది. ఆయన రీసెంట్ మూవీ కింగ్ డమ్ ప్రమోషన్ల సమయంలో విజయ్ మాట్లాడితే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయింది. అ సమయంలో ఇప్పుడు విజయ్ ను టాప్ లో కూర్చోబెట్టేందుకు ఆడియన్స్ కూడా సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాతో వస్తే ఎక్కడికో తీసుకెళ్తారు. ఆయన రీసెంట్ గా తిరుపతిలో అన్నట్లు టాప్ లో కూర్చుంటాడు! మరేం జరుగుతుందో వేచి చూడాలి.