విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ.. ఇదిగో అసలు క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-13 16:51 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ డాన్-3లో నటిస్తారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే విజయ్ కు మేకర్స్ స్టోరీ వినిపించారని.. ఆయన ఓకే కూడా చెప్పారని టాక్ వచ్చింది.

అయితే డాన్ 2 మూవీ వచ్చిన 14 ఏళ్ల తర్వాత డాన్ 3ను అనౌన్స్ చేశారు డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్. ఫస్ట్ రెండు చిత్రాల్లో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లీడ్ రోల్ పోషించగా.. ఇప్పుడు రణవీర్ సింగ్ నటిస్తున్నారు. క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. రెండో హీరోయిన్ గా కృతి సనన్ కనిపించనున్నట్లు టాక్.

అదే సమయంలో సినిమాలో విలన్ రోల్ కోసం విజయ్ దేవరకొండను మేకర్స్ సంప్రదించినట్లు ప్రచారం జరిగింది. ఇప్పటికే విజయ్ ను ఫర్హాన్ అక్తర్ కలిశారని.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారని టాక్ వినిపించింది. విలన్ రోల్.. హీరో పాత్రకు దీటుగా డిజైన్ చేశానని కూడా చెప్పినట్లు గుసగుసలు వినిపించాయి.

విజయ్ కథకు ఓకే చెప్పేశారని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను విజయ్ దేవరకొండ ఫాలో అవుతున్నారని అంతా అనుకున్నారు. ఎందుకంటే వార్-2 మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న తారక్.. ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించనున్నారని ఎప్పటి నుంచో టాక్ వస్తోంది.

దీంతో ఇప్పుడు విజయ్ కూడా డాన్-3లో అలాంటి రోల్ లో కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ విలన్ గా నటించడం లేదని తెలుస్తోంది. తనకు ప్రతిపాదించిన పాత్రను తిరస్కరించినట్లు సమాచారం. డాన్ 3 ప్రాజెక్టును వదులుకున్నారని టాక్ వినిపిస్తోంది.

విలన్ గా నటించడం ఇష్టం లేక మేకర్స్ కు నో చెప్పారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా ఇప్పుడు డాన్-3 తో బాలీవుడ్ లోకి విజయ్ అడుగుపెట్టబోతున్నారన్న వార్తలకు చెక్ పడిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు విజయ్ తన అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో కింగ్డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Tags:    

Similar News