విజయ్ ఫ్లాప్ మూవీ రీమేక్ ప్లాన్ ఇంకా ఉందా? కచ్చితంగా తీస్తారా?

నిజానికి విజయ్ ఫ్లాప్ సినిమా రీమేక్ పై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొన్నాళ్ల క్రితం అఫీషియల్ గా ప్రకటన చేశారు.;

Update: 2026-01-06 15:30 GMT

టాలీవుడ్ విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. అర్జున్ రెడ్డి మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత పలు సినిమాలు చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. కానీ కొన్ని చిత్రాలతో నిరాశపరిచారు. అందులో ఒకటి డియర్ కామ్రేడ్. ఆ మూవీ రిలీజ్ అయ్యి ఏడేళ్లు అయిపోతుంది.

డైరెక్టర్ భరత్ కమ్మ రూపొందించిన డియర్ కామ్రేడ్ మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాలోని పాటలు అందరినీ మెప్పించాయి. ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా వచ్చినా.. ఓవరాల్ గా సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. అయితే డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్ పై ఎప్పటికప్పుడు వార్తలు వస్తుంటాయనే చెప్పాలి.

నిజానికి విజయ్ ఫ్లాప్ సినిమా రీమేక్ పై బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కొన్నాళ్ల క్రితం అఫీషియల్ గా ప్రకటన చేశారు. దీంతో బీ టౌన్ లో ఎవరు నటిస్తారోనని అంతా అప్పట్లో డిస్కస్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో కరణ్ జోహార్.. సినిమాను పక్కన పెట్టి ఉంటారని అందరూ ఫిక్స్ అయిపోయారు.

కానీ రీసెంట్ గా మళ్లీ డియర్ కామ్రేడ్ రీమేక్ పై వార్తలు వచ్చాయి. త్వరలో సినిమా పట్టాలెక్కనుందని.. నటుడు సిద్ధాంత్ చతుర్వేది లీడ్ రోల్ లో నటిస్తారని ప్రచారం జరిగింది. దీంతో చాలా ఏళ్ల క్రితం వచ్చిన మూవీని ఇప్పుడు ఎందుకు రీమేక్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. కరణ్ జోహర్ ప్లాన్ ఏంటోనని మాట్లాడుకున్నారు.

దానికి తోడు ఫ్లాప్ అయిన మూవీని రీమేక్ చేయడం ఎందుకని డిస్కస్ చేసుకున్నారు. కానీ స్క్రిప్ట్ లో మార్పులు చేసిన తర్వాతనే.. సినిమాను రీమేక్ చేయాలనే ప్లాన్ లో కరణ్ జోహార్ ఉన్నారని, మంచి హిట్ అందుకోవాలని పట్టుదలతో ఉన్నారని టాక్ వినిపించింది. దీంతో మూవీ స్టార్ట్ అవ్వడం పక్కా అని అంతా అనుకున్నారు.

కానీ ఇంతలో సిద్ధాంత్ చతుర్వేది సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు. తానేం హిందీ వెర్షన్ డియర్ కామ్రేడ్ సినిమాలో నటించడం లేదని తెలిపారు. తనకు పర్సనల్ గా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇష్టమని చెప్పారు. కానీ డియర్ కామ్రేడ్ రీమేక్ లో యాక్ట్ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. అంతే కాదు అసలు రీమేక్ లు చేయనని చెప్పారు.

అదే సమయంలో కరణ్ జోహార్ మాత్రం రెస్పాండ్ అవ్వలేదు. దీంతో ఆయన సినిమా తీయడం నిజమేలా ఉందని.. కానీ సిద్ధాంత్ చతుర్వేది నటించడం లేదమో అని కామెంట్లు పెట్టారు నెటిజన్లు. అలా డియర్ కామ్రేడ్ రీమేక్ కహానీ హాట్ టాపిక్ గా మారింది. అసలు ఆ సినిమా ఉంటుందో లేదో.. ఉంటే ఎవరు యాక్ట్ చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News