నో పాలిటిక్స్ ప్లీజ్ అంటున్న విజయ్..!

ఒకవేళ ప్రజలకు సేవ చేయాలని ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే అది పూర్తిస్థాయి ప్రజల మద్ధతుతో చేయాలని అన్నారు విజయ్.;

Update: 2025-06-25 13:29 GMT

బిచ్చగాడు, బేతాళుడు, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని తను తీసే ప్రతి సినిమాను తెలుగు ఆడియన్స్ ముందుకు తెస్తున్నాడు. లేటెస్ట్ గా అతను నటించిన మార్గన్ సినిమా కూడా తెలుగు రిలీజ్ అవుతుంది. ఈ నెల 27న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ ఆంటోని పాల్గొన్నాడు. ఈ క్రమంలో తనకు రాజకీయాల్లో నాలెజ్డ్ లేదని.. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన అసలు లేదని చెప్పారు.

కాస్త ఫేమ్ ఉన్న ప్రతి స్టార్ కూడా రాజకీయాల్లోకి రావడం కామన్ అయ్యింది. ఐతే అక్కడ నిలదొక్కుకునే వారి సంఖ్య తక్కువే అయినా సినిమా టు పాలిటిక్స్ అనేది ఈమధ్య బాగా వినపడుతుంది. ఐతే విజయ్ ఆంటోని ని కూడా రాజకీయాల గురించి అడిగితే.. తనకు అసలు పాలిటిక్స్ మీద అవగాహన లేదని చెప్పాడు. కేవలం ఫేమ్‌ ఉందని రాజకీయాల్లోకి రావడం కుదరదని అన్నారు. అసలు తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. యాక్టర్స్ అంతా కూడా రాజకీయాల్లోకి రావాలన్న రూల్ లేదని అన్నారు విజయ్ ఆంటోని.

ఒకవేళ ప్రజలకు సేవ చేయాలని ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే అది పూర్తిస్థాయి ప్రజల మద్ధతుతో చేయాలని అన్నారు విజయ్. ముందు ప్రజల సమస్యలు అర్ధం చేసుకున్న తర్వాతే పాలిటిక్స్ లోకి రావాలని అన్నారు. తనకైతే అసలు అలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చారు విజయ్ ఆంటోని. ఇదే క్రమంలో సినిమా పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారంపై స్పందించారు విజయ్ ఆంటోని. పరిశ్రమలో ఈ సమస్య ఉందని చాలామంది దానికి బానిస అవుతున్నారని అన్నారు.

విజయ్ ఆంటోని నటించిన మార్గన్ మూవీని లియో జాన్ పాల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్ రోల్ చేశాడు. ఈ సినిమాతోనే అతను నటుడిగా పరిచయం అవుతున్నాడు. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ నెల 27న పాన్ ఇండియా లెవెల్ లో మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమాతో విజయ్ ఆంటోని మార్గన్ ఎంతవరకు పోటీ ఇస్తుందో చూడాలి.

ఫలితాలతో సంబంధం లేకుండా విజయ్ ఆంటోని తను తీసే ప్రతి సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. బిచ్చగాడు, బిచ్చగాడు 2 సక్సెస్ అవ్వగా మిగతా సినిమాలన్నీ ఇలా వచ్చి అలా వెళ్తున్నాయి. మరి మార్గన్ తో విజయ్ ఆంటోని కోరుకుంటున్న హిట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

Tags:    

Similar News