పాపం విజయ్ ఆంటోనీ..ఇలా కబ్జా చేసేస్తే ఎలా?
ఒక ఫార్ములా స్టోరీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోందంటే మిగతా వారు కూడా అదే తరహా కాన్సెప్ట్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు.;
ఒక ఫార్ములా స్టోరీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తోందంటే మిగతా వారు కూడా అదే తరహా కాన్సెప్ట్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇప్పుడు ఇదే జరుగతోంది. అయితే ఈ విషయంలో విజయ్ ఆంటోనీ కాన్సెప్ట్‌ని ఇలా కబ్జా చేసేస్తే ఎలా అని ఆడియన్స్ కామెంట్‌లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న విజయ్ సేతుపతి ఆ తరువాత `నాన్` మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో విజయ్ హీరోగా కంటిన్యూ కావడం మొదలు పెట్టాడు. అయితే అతనికి దక్షిణాది భాషల్లో మంచి గుర్తింపుని తెచ్చిన సినిమా మాత్రం `బిచ్చగాడు` సినిమానే. 2016లో విడుదలైన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సంచలనం సృష్టించింది. తల్లి ఆరోగ్యం కోసం బిచ్చగాడిగా మారే కోటీశ్వరుడి కథగా విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా రెండు భాషల్లోనూ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టి హీరోగా విజయ్ ఆంటోనీకి తిరుగులేని గుర్తింపుని తెచ్చి పెట్టింది.
దీని తరువాత దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం విజయ్ ఆంటోనీ మళ్లీ తనకు కలిసొచ్చిన బిచ్చగాడు కాన్సెప్ట్ ని తీసుకుని చేసిన మూవీ `బిచ్చగాడు 2`. దీనికి తనే స్వయంగా దర్శకత్వం వహించాడు. ఇది కూడా హిట్ కావడంతో అంతా `బిచ్చగాడు 3` కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే తను మొదలు పెట్టిన బిచ్చగాడు కాన్సెప్ట్‌ని ఇప్పుడు దర్శకులు కబ్జా చేసి హైజాక్ చేస్తున్నారు. రీసెంట్‌గా ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన మూవీ `కుబేర`. బిచ్చగాడు కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా రిసెంట్‌గా విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.
తొలి రోజే రూ.30 కోట్లు వసూలు చేసి భారీ వసూళ్ల దిశగా పయనిస్తోంది. ఇందులో హీరో ధనుష్ బిచ్చగాడిగా నటించాడు. అతని నటన ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుండటంతో సినిమా భారీ వసూళ్ల దిశగా పయనిస్తోంది. ఇక దీని తరువాత మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి మూవీని బిచ్చగాడు కాన్సెప్ట్‌తో చేయబోతున్న విషయం తెలిసిందే. విజయ్ సేతుపతి హీరోగా టాబు, సంయుక్త మీనన్, దునియా విజయ్ కీలక పాత్రల్లో పూరీ ఓ భారీ మూవీకి శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈమూవీలో హీరో విజయ్ సేతుపతి బెగ్గర్‌గా కనిపించబోతున్నాడు.
ఈ నేపథ్యంలోనే విజయ్ ఆంటోనీని అభిమానించే వారంతా పాపం విజయ్ ఆంటోనీ తను మొదలు పెట్టిన బిచ్చగాడు కాన్సెప్ట్‌ని ఇతర దర్శకుడు హైజాక్ చేసేస్తున్నారని, ఇలా అయితే `బిచ్చగాడు 3` పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఆంటోనీ `బిచ్చగాడు 3`ని మరో రెండేళ్ల తరువాతే మొదలు పెట్టే అవకాశం ఉందని, అయితే అంత వరకు పూరీ బిచ్చగాడు కాన్సెప్ట్‌తో శేఖర్ `కుబేర` తరహాలో సక్సెస్‌ని సొంతం చేసుకుంటాడా? లేక విజయ్ బిచ్చగాడు 3కి స్పేస్ ఇస్తాడా? అన్నది వేచి చూడాల్సిందే.