ఐరెన్ లెగ్ ట్యాగ్ తో తొమ్మిది ఛాన్సులు మిస్!

హీరోయిన్ గా స‌క్సెస్ అయిన అనంత‌రం ఆ స‌క్సెస్ ని కొన‌సాగించ‌డం అంతే కీల‌కం. స‌రైన అవ‌కాశాలు..విజ‌యాలు అందుకున్న‌ప్పుడే ఆ స‌క్సెస్ కి ఓ అర్దంలా నిలుస్తుంది.;

Update: 2025-08-23 20:30 GMT

హీరోయిన్ గా స‌క్సెస్ అయిన అనంత‌రం ఆ స‌క్సెస్ ని కొన‌సాగించ‌డం అంతే కీల‌కం. స‌రైన అవ‌కాశాలు..విజ‌యాలు అందుకున్న‌ప్పుడే ఆ స‌క్సెస్ కి ఓ అర్దంలా నిలుస్తుంది. లేదంటే అవ‌కాశాలు వ‌చ్చి ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రిస్తే మాత్రం ఇండ‌స్ట్రీ మ‌రోలా కూడా ట్రీట్ చేస్తుంది. ప‌రిశ్ర‌మ ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసిందంటే? ఆప్ర‌భావం మొత్తం కెరీర్ నే నాశ‌నం చేస్తుంది. అలా ఇండ‌స్ట్రీ నుంచి క‌నుమ‌రుగైన తారా మ‌ణులెంతో మంది. తాజాగా బాలీవుడ్ న‌టి విద్యాబాల‌న్ పై ఆ ట్యాగ్ ఎలాంటి ప్ర‌భావం చూపించింద‌న్న‌ది బ‌య‌ట‌కొచ్చింది.

ఎదురు ప్ర‌శ్నించిన న‌టి:

గ‌తంలో మ‌ల‌యాళంలో విద్యాబాల‌న్ కు మోహ‌న్ లాల్ తో న‌టించే అవ‌కాశం వ‌చ్చిందిట‌. కానీ అప్ప‌టి ఐరెన్ లెగ్ అనే ముద్ర పడ‌టంతో ఆ సినిమా నుంచి విద్యా బాల‌న్ ని తొల‌గించారని చాలా మంది అనుకుం టారు. ఆ ట్యాగ్ ఆ సినిమాతో ప‌ర్వాలేదు. కానీ సినిమా నుంచి తొల‌గించిన త‌ర్వాత ఏకంగా తొమ్మిది సిని మా అవ‌కాశాలు కోల్పోయింది. ఆ సినిమాలు ఏంటి? అన్న‌ది తెలియ‌దు గానీ ఒక్క‌రు తొలగించ‌డం వ‌ల్ల మిగ‌తా ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు కూడా సినిమాకు ప‌నికి రాదు ? అన్న‌ట్లే ట్రీట్ చేయ‌డం శోచ‌నీయమ‌ని ఓ మ‌లయాళ న‌టి పేర్కొంది. అర్దంత‌రంగా అడ్వాన్స్ ఇచ్చిన త‌ర్వాత ప్రాజెక్ట్ నుంచి తొల‌గించ‌డం అన్న‌ది ఎంత వ‌ర‌కూ న్యాయమ‌ని ప్ర‌శ్నిచింది.

ఓపిక అంతే అవ‌స‌రం:

అయితే ఏదీ మ‌న చేతుల్లో ఉండ‌ద‌ని అక్కున చేర్చుకుని ఇండ‌స్ట్రీ ఎన్నిగొప్ప అవ‌కాశాలు ఇస్తుందో? ఎక్క‌డైనా తేడా జ‌రిగితే కెరీర్ ప‌రంగా కోలుకులేని దెబ్బ కూడా అదే ప‌రిశ్రమ కొడుతుంది? అన్న‌ది చాలా మంది న‌టీమ‌ణుల్లో చూసాను. సినిమాల్లో రాణించాలంటే అదృష్టంతో పాటు, ఎంతో ఓపిక కూడా ఉండా లంది. ఒకానొక ద‌శ‌లో త‌న‌కు అవ‌కాశాలు రాలేదని అయినా స‌రే ఆస‌మ‌యంలో ఇండ‌స్ట్రీని అంటిపె ట్టుకుని ఉండ‌టంతో చిన్న పాటి అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్లు గుర్తుచేసుకుంది.

ఆల‌స్య‌మైనా సాధ‌న దిశ‌గా:

ప్ర‌స్తుతం కెరీర్ ప‌రంగా సంతోషంగానే ఉంద‌ని పేర్కొంది. కానీ న‌టిగా తాను సాధించిన స‌క్సెస్ లు ఇంకా మిగిలే ఉన్నాయి? అంది. ఆ దిశ‌గానే ప్ర‌యాణం సాగుతుంద‌ని...ఆల‌స్యమైనా తాను అనుకున్న‌ది మాత్రం క‌చ్చితంగా సాధించి తీరుతాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది. ఈ బ్యూటీ ఇటీవలే ఓ లేడీ ఓరియేంటెడ్ సిని మాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు రివ్యూలు పాజిటివ్ గానే వ‌చ్చాయి. క‌థాబ‌లం ఉన్న చిత్రంగానే క‌నిపించింది. కానీ ఈ జ‌న‌రేష‌న్ కి క‌నెక్ట్ అవ్వ‌డం క‌ష్ట‌మ‌నే మాట వినిపిస్తోంది.

Tags:    

Similar News