వందల కోట్ల బడ్జెట్.. గ్రాఫిక్స్ మాత్రం..!

వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారన్నది అర్ధం కావట్లేదు. నాసిరం గ్రాఫిక్స్ వల్ల సినిమాను చూడాలనుకున్న ఆడియన్స్ కూడా వద్దు బాబోయ్ అనేలా చేస్తున్నారు.;

Update: 2025-08-15 07:38 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్న సినిమాలకు పెద్ద టెన్షన్ గా మారిన అంశం వి.ఎఫ్.ఎక్స్ వర్క్. సినిమాలో కాస్త గ్రాఫిక్స్ పాళ్లు ఎక్కువ ఉంటే చాలు ఇదేం సీజీ వర్క్ బాబోయ్ అనేస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా స్టార్ సినిమాలకు వందల కోట్ల బడ్జెట్ పెడుతూ ఈ సీజీ వర్క్ షాట్స్ ని క్వాలిటీతో తీసుకు రాలేకపోవడం కాస్త విడ్డూరంగానే ఉంది. అసలే ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీల ద్వారా హై క్వాలిటీ సీజీస్, యానిమేటెడ్ సీరీస్ లు చూస్తున్నారు.

నాసిరకం సీజీ వర్క్..

అలాంటి వాటిని చూసిన వాళ్లు ఈ నాసిరకం సీజీ వర్క్ ని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు. నిన్న రిలీజైన వార్ 2 లో కూడా కొన్ని సీన్స్ లో సీజీ వర్క్ తేలిపోయింది. అసలే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సినిమాటిక్ లిబర్టీని బాగా తీసేసుకున్నాడని అనుకుంటే దానికి ఈ సీజీ వర్క్ లు మరీ దారుణంగా తయారై ఎఫెక్ట్ సినిమా మీద పడేలా చేస్తున్నాయి. వార్ 2 సినిమాలో ఎన్ టీ ఆర్ లుక్స్, హృతిక్ రోషన్ కొన్ని షాట్స్ ఇలా అన్నిటిలీ కూడా సీజీ వర్క్ అసలేమాత్రం ఆకట్టుకోలేదు.

వందల కోట్ల బడ్జెట్ పెడుతున్న మేకర్స్ ఎందుకు వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారన్నది అర్ధం కావట్లేదు. నాసిరం గ్రాఫిక్స్ వల్ల సినిమాను చూడాలనుకున్న ఆడియన్స్ కూడా వద్దు బాబోయ్ అనేలా చేస్తున్నారు. వార్ 2 లో కొన్ని సీన్స్ లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వర్క్ అవుట్ కాలేదు. ఈమధ్య కాలంలో ఇలా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ మీద ఆధారపడ్డ సినిమాలన్నిటికీ ఇదే సమస్య వస్తుంది.

కోడి రామకృష్ణ అద్భుతమైన గ్రాఫిక్స్..

సినిమాకు పెట్టే ఖర్చులో సీజీ వర్క్ కే ఎక్కువ చేస్తున్నారు. అయినా కూడా క్వాలిటీ విషయంలో ఆడియన్స్ ని మెప్పించలేకపోతున్నారు. వార్ 2 చూసిన ఆడియన్స్ ఆ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చూసి షాక్ అవుతున్నారు. ఇంకా ఎన్ని సినిమాలు ఇలా నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో చేస్తారు. ఆడియన్స్ రియాక్షన్ ని బట్టి క్వాలిటీ విషయంలో పంథా మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పాన్ ఇండియా సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ అయితే చాలు సినిమా చూడటానికి కూడా ఆడియన్స్ ముందుకొచ్చే ఇంట్రెస్ట్ చూపించరు.

ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల క్రితమే కోడి రామకృష్ణ అద్భుతమైన గ్రాఫిక్స్ తో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు ఏ.ఐ టెక్నాలజీ వచ్చాక కూడా ఇలా చేయడం ఏమాత్రం ఆమోదయోగం కాదు. మరి మేకర్స్ ఈ విషయంపై రీ థింక్ చేసి సినిమాల్లో గ్రాఫిక్స్ క్వాలిటీ బెస్ట్ ఇచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News