ఆ స్టార్ డైరెక్టర్ కే ఎందుకిలా జరుగుతోంది?
కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రీమారన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 17 ఏళ్లగా దర్శకుడిగా పని చేస్తున్నాడు.;
కోలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెట్రీమారన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 17 ఏళ్లగా దర్శకుడిగా పని చేస్తున్నాడు. కానీ ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు కొన్ని మాత్రమే. కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమై డైరెక్ట్ చేసారు. ఆ సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. అతడు కమర్శియల్ డైరెక్టర్ కాదు. కానీ వెట్రీ మారన్ తీసే ఏ సినిమా అయినా? ఓ సంచలనంగా మారుతుంది. అందుకే స్టార్ హీరోలంతా అతడితో పని చేయాలని ఎదురు చూస్తుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వెట్రీమారన్ కోసం క్యూలో ఉన్న హీరో.
సూర్య ఇంకా ఆయనకు దూరంగానే:
కానీ వెట్రీమారన్ ని మాత్రం దురదృష్టం అన్నది పతాక స్థాయిలోనే వెంటాడుతున్నట్లు కనిపిస్తోంది. ఆయన ఏ ప్రాజెక్ట్ అనుకుంటే? అది ప్రకటనకే పరిమితమవుతుంది తప్ప పట్టాలెక్కడం లేదు. ఒకవేళ పట్టాలెక్కినా ఏదో కా రణంతో ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సూర్యతో `వాడివాసల్` ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కాల్సిన చిత్రమిది. ఇప్పటికే సినిమా సగం షూటింగ్ కూడా పూర్తి కావాలి. కానీ ఈ సినిమా ఇంత వరకూ ప్రారంభం కాలేదు. సూర్య వేర్వేరు సినిమాలు చేస్తున్నాడు ? తప్ప ఈ సినిమా మాత్రం మొదలవ్వలేదు.
ధనుష్ ప్రాజెక్ట్ ఆగిందా:
అనంతరం ధనుష్ హీరోగా `వడచెన్నై 2` కూడా వెట్రీమారన్ ప్రకటించారు. ఈ సినిమా ప్రారంభంలోనూ అదిగో ..ఇదిగో అన్న ప్రచారం తప్ప ఇంత వరకూ ఇదీ ప్రారంభం కాలేదు. అందుకు గల కారణాలు ఏంటి? అన్నది ఇప్పటికీ బయటకు రాలేదు. ఈ రెండు సాధ్యం కాకపోవడంతో? శింబు హీరోగా `అరసన్` అనే చిత్రాన్ని ప్రకటించాడు. సోమవారమే సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవాలి. కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయేలా కనిపిస్తోంది. కోర్టు వివాదం నేపథ్యంలో ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. శింబు-వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వివాదమే అందుకు కారణం.
కోర్టు వివాదంలో ఆ సినిమా:
ఈ బ్యానర్ లో శింబు `కరోనా కుమార్` అనే సినిమాకు కమిట్ అయ్యాడు. అయితే ఆ సినిమా పూర్తి చేయడంలో శింబు విఫలమవ్వడంతో? ఇతర బ్యానర్లో సినిమాలు పూర్తి చేయడానికి వీలు లేదంటూ కోర్టులో పిటీషన్ దాఖలైంది. శింబు ఇచ్చిన మాటను..తన బాధ్యతను పూర్తి చేయడంలో విఫలమయ్యాడంటూ ఫిల్ దాఖలైంది. నిర్మాణ సంస్థ నుంచి అడ్వాన్స్ తీసుకుని తమ సినిమా షూటింగ్ కి హాజరు కాలేదన్నది నిర్మాతల ఆరోపణ. ఇది తమ సినిమాకు తీవ్ర నష్టం కలిగించిందని పేర్కొన్నారు. కేసు విచారణ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.