• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకటేష్ ఆ ఛాన్స్ ఎందుకు...

వెంకటేష్ ఆ ఛాన్స్ ఎందుకు తీసుకోకూడదు..?

| ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కి తిరుగు లేని క్రేజ్ ఉన్నా ఆయన చేసే యాక్షన్ సినిమాలకు కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు.

By - Tupaki Desk
Update: 2024-02-12 16:30 GMT

విక్టరీ వెంకటేష్ ఈమధ్య సైంధవ్ సినిమాతో రాగా ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. శైలేష్ కొలను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ పాళ్లు ఎక్కువ కాగా సినిమాలో ఎమోషన్ అసలు వర్క్ అవుట్ కాలేదు. f2, f3 సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ సైంధవ్ తో యాక్షన్ హిట్ కొడతాడని అనుకోగా అది కాస్త మిస్ ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో వెంకటేష్ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫ్యామిలీ హీరోగా వెంకటేష్ కి తిరుగు లేని క్రేజ్ ఉన్నా ఆయన చేసే యాక్షన్ సినిమాలకు కూడా సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సరైన కథ కథనాలు లేకపోవడం వల్ల కొన్ని టార్గెట్ మిస్ అవుతున్నాయి. సీనియర్ స్టార్స్ తమ అభిమానులను అలరించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కింగ్ నాగార్జున ప్లాన్ వేరేలా ఉంటుంది. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ పై తిరుగులేని కింగ్ గా నిలిచిన నాగార్జున బుల్లితెర మీద కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు చేశారు. ఆ షో సక్సెస్ అవ్వడం తో బిగ్ బాస్ కి కూడా ఆయన హోస్ట్ గా కొనసాగుతున్నారు.

నాగార్జున తర్వాత చిరంజీవి కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు షోని హోస్ట్ చేశారు. అలా స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని అలరించారు చిరంజీవి. ఇక మరోపక్క బాలకృష్ణ కూడా నేనేమి తక్కువ కాదంటూ అన్ స్టాపబుల్ షోతో అలరించారు. ఆ షో తో బాలయ్య ఇంత సరదాగా ఉంటారా అని ఆడియన్స్ షాక్ అయ్యారు. అప్పటి నుంచి బాలకృష్ణ సినిమాల ఫలితాలు కూడా ఓ రేంజ్ లో ఉన్నాయి.

ఇలా సీనియర్ స్టార్స్ అంతా కూడా కేవలం సినిమాలే కాకుండా స్మాల్ స్క్రీన్ లేదా డిజిటల్ లో అయినా హోస్ట్ గా చేసి మెప్పించారు. అయితే సీనియర్ స్టార్స్ లో ముగ్గురు హీరోలు ఇలా చేయగా వెంకటేష్ మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. వెంకటేష్ కూడా స్మాల్ స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. హోస్ట్ గా చేస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుంది. ఎప్పుడు యాక్షన్ కట్ అనేలా కాకుండా వారి న్యాచురల్ బిహేవియర్ చూడాలని ఆడియన్స్ కోరతారు. సో వెంకటేష్ కూడా అలా ఏదైనా షోకి హోస్ట్ గా చేస్తే మాత్రం కచ్చితంగా వేరే లెవెల్ లో ఉంటుందని చెప్పొచ్చు.


Tags:    
  • Tollywood 
  • Victory 
  • Venkatesh 
  • Starhero 
  • Siandhavmovie 
  • Hosting 
  • Smallscreen 
  • Television 
  • Filmindustry 

Similar News

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

Copyright @2026

Powered by Blink CMS