అనుకున్నట్లే ఒక్కటైన వెంకీ న్యూ కాంబో
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్ కమింగ్ సినిమాలకు సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇంకా ఎలాంటి అనౌన్స్మెంట్ అఫీషియల్ గా రాకపోయినప్పటికీ ఓ రేంజ్ లో వార్తలు స్ప్రెడ్ అవుతుంటాయి. ఆ తర్వాత అవే నిజమై.. కొద్ది రోజుల తర్వ్తాప్ అధికారికంగా బయటకు వస్తాయి.
ఇప్పుడు విక్టరీ వెంకటేష్- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ విషయంలో అదే జరిగింది. కొన్ని నెలల నుంచి వారి కాంబినేషన్ లో సినిమా వస్తుందని ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా నిర్మాత నాగవంశీ, వెంకటేష్ వేర్వేరు ఇంటర్వ్యూల్లో రివీల్ చేసినప్పటికీ.. అంతకుముందు నుంచే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే ఇప్పుడు అధికారికంగా వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులు కలిపారు. వారిద్దరి కలయికలో ఇప్పటికే నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు రాగా.. బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ను ఫుల్ గా మెప్పించాయి. కానీ ఆ రెండు సినిమాలకు కేవలం త్రివిక్రమ్ రైటర్ గా వర్క్ చేశారు.. డైరెక్టర్ గా మాత్రం కాదు.
దీంతో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకీ మూవీ చేయాలని ఎప్పటి నుంచో అందరూ కోరుకుంటుండగా.. ఇప్పుడు నిజమైంది. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను త్రివిక్రమ్ సిద్ధం చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో నేడు సంప్రదాయమైన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
ప్రతిష్టాత్మక హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సినిమాను నిర్మించనుండగా, త్వరలో షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. ఇప్పుడు పూజా కార్యక్రమాల పిక్చర్స్ ను ఆయనే షేర్ చేశారు. సురేష్ బాబు కెమెరా స్విచ్చాన్ చేసేందుకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు.
కాగా, భావోద్వేగ లోతుతో కుటుంబ వినోద చిత్రాలు తీయడంలో అద్భుతమైన పట్టుకు పేరుగాంచిన త్రివిక్రమ్, ఫ్యామిలీ ఆడియన్స్ లో యమా క్రేజ్ ఉన్న వెంకటేష్ కలిసి వర్క్ చేస్తుండడంతో ఇప్పటికే ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమాలో ఇద్దరి మార్క్ క్లియర్ గా కనిపిస్తుందని ఫిక్స్ అయ్యారు. మూవీ కోసం ఇప్పటి నుంచి ఆసక్తిగా ఉన్నారు.