ఆ కమెడియన్‌పై సూపర్ స్టార్ నమ్మకం
ఇప్పటి వరకు తన కామెడీతో నవ్వించి, అభిమానులను సొంతం చేసుకున్న వీర్ దాస్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.;
ఇప్పటి వరకు తన కామెడీతో నవ్వించి, అభిమానులను సొంతం చేసుకున్న వీర్ దాస్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. తన ఆప్తుడు శాస్త్రీతో కలిసి మొదటి సినిమాను దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ నటించనున్న నేపథ్యంలో ఒక్కసారిగా సినిమా స్థాయి డబుల్ అయింది. ఈ సినిమాలో హీరోగా వీర్ దాస్ నటించబోతున్నాడు. తానే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే విభిన్నమైన టైటిల్ ను ఖరారు చేశాడు. 'హ్యాపీ పటేల్' అనే టైటిల్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఆమీర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ సినిమాతో వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశను మిగిల్చింది. ఆమీర్ ఖాన్ ఇమేజ్, గతంలో వచ్చిన తారే జమీన్ పర్ సినిమా సీక్వెల్ అంటూ చేసిన ప్రచారం కూడా సితారే జమీన్ పర్ సినిమాను కాపాడలేక పోయింది. దాంతో ఆమీర్ ఖాన్ తదుపరి సినిమా ఏంటా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆమీర్ ఖాన్ కొత్త సినిమా ఇది అని కన్ఫర్మ్ అయింది. అయితే ఈ సినిమాలో ఆమీర్ ఖాన్ మెయిన్ లీడ్ కాదు, కథలో కీలక సమయంలో వచ్చే ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆమీర్ ఖాన్ స్క్రీన్ టైమ్ కూడా దాదాపుగా 30 నిమిషాలు మాత్రమే ఉంటుందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
హ్యాపీ పటేల్ సినిమాలో ఆమీర్ ఖాన్ నటించడమే చాలా పెద్ద విషయం. ఆయన సినిమాలో కొన్ని నిమిషాలు కనిపించినా అభిమానులు సినిమాను ఆకాశానికి ఎత్తుతారు. ఆమీర్ ఖాన్ ఏకంగా 30 నిమిషాలు కనిపిస్తాడు అంటూ వార్తలు వస్తున్నాయి కనుక ఖచ్చితంగా ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వీర్ దాస్ సినిమా అయినప్పటికీ ఆమీర్ ఖాన్ అభిమానులు హ్యాపీ పటేల్ మూవీ విడుదల కోసం వెయిట్ చేస్తారు అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో నటించేందుకు ఆమీర్ ఖాన్ ఓకే చెప్పడం ఆశ్చర్యంగా ఉందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆమీర్ ఖాన్ సినిమాల ఎంపికకు చాలా సమయం తీసుకుంటున్నాడు.
వీర్ దాస్ కి ఉన్న స్టార్‌డం, ఆయన ప్రతిభపై నమ్మకంతో సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. వీర్ దాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అనడంలో సందేహం లేదు. ఆయన రైటింగ్ స్టైల్‌ను ఆమీర్ ఖాన్ ఇష్టపడుతాడట. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పి ఉంటాడని తెలుస్తోంది. సోలో హీరోగా ఎలాగూ విజయాలు దక్కని ఆమీర్ ఖాన్‌కి ఈ సినిమా హిట్ అయితే అయినా కాస్త ఉపశమనం లభిస్తుందేమో చూడాలి. దశాబ్ద కాలంగా ఆమీర్ ఖాన్ హిట్స్ కోసం చకోరా పక్షి తరహాలో ఎదురు చూస్తున్నాడు. కనీసం ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం ద్వారా ఆయన ఫ్యాన్స్ కూడా రిలాక్స్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.