వరుణ్ తేజ్.. ఈ లుక్ కిర్రాక్ గురు

రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస మూవీల్లో నటిస్తున్నారు వరుణ్.

Update: 2024-05-23 15:06 GMT

ఇండస్ట్రీలో హీరోలు చేసిన ఎక్స్పరిమెంట్స్ కొన్ని సార్లు వర్కౌట్ అవ్వవు. కానీ కొందరు మాత్రం మాత్రం ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వరుణ్ చూపులన్నీ ప్రయోగాలపైనే ఉన్నాయి. విభిన్నమైన జోనర్లలో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస మూవీల్లో నటిస్తున్నారు వరుణ్.


అప్పుడప్పుడు మెగా రూట్ ఫాలో అయినా.. ఎప్పుడూ తనకంటూ సపరేట్ రూట్ వేసుకోవడానికే ఇష్టపడుతుంటారు వరుణ్ తేజ్. కొన్ని మాస్ సినిమాలు తప్ప.. ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో చాలా వరకు డిఫెరెంటే. ఫలితంతో పని లేకుండా ముకుంద, కంచె, అంతరిక్షం లాంటి భిన్నమైన మూవీలు చేశారు వరుణ్. వీటితో పాటు ఫిదా, తొలిప్రేమ లాంటి లవ్ స్టోరీస్‌ తో కూడా ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు.

ఆ మధ్య ఎక్కువగా ఇమేజ్ బేస్ట్ కథలు ఎంచుకున్నారు వరుణ్ తేజ్. అందులో ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. గని, గాంఢీవదారి అర్జున బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. ఇటీవల ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు కరుణ కుమార్‌ తో పీరియాడిక్ సినిమా మట్కా చేస్తున్నారు. ఈ మూవీతో గట్టి హిట్ కొట్టాలని వరుణ్ తేజ్ చూస్తున్నారు.

ఇక పర్సనల్ విషయానికొస్తే.. ఇటీవల తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా పిఠాపురంలో వరుణ్ పర్యటించారు. పవన్ ను ఓటేసి గెలిపించాలని కోరారు. ఇక ఎన్నికలు ముగిశాక.. మళ్లీ సినిమా షూటింగ్ తో బిజీగా మారారు. లేటెస్ట్ గా వరుణ్.. వెకేషన్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇన్ స్టాలో అట్రాక్షన్ అంటూ క్యాప్షన్ ఇచ్చి ఫోటో షేర్ చేశారు. ఆ పిక్ లో వరుణ్.. ఓ రేంజ్ లో ఉన్నారు. బ్లాక్ కలర్ షర్ట్.. సింపుల్ గ్లాసెస్.. కర్లీ హెయిర్.. అలా వరుణ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.

Read more!

ఇక ఇప్పుడు వరుణ్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సూపర్బ్ అన్నా అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు లావణ్య ఎక్కడ అని క్వశ్చన్ చేస్తున్నారు. అయితే హీరోయిన్ లావణ్య త్రిపాఠిని వరుణ్ ప్రేమించి గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇటలీలో వీరి వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఇటీవల ఇద్దరూ వెకేషన్ కు వెళ్లినట్లు లావణ్య పోస్ట్ చేసింది. మళ్లీ ఇప్పుడు ఇద్దరూ వెళ్లారా లేక వరుణ్ ఒక్కరే వెళ్లారా అన్నది చూడాలి.

Tags:    

Similar News