• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శబాష్.. వరుణ్ తేజ్!

శబాష్.. వరుణ్ తేజ్!

| ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని కళ్లతోనే భావోద్వేగాలు పండించడం ఏ నటుడుకైనా అంత సులభం కాదు. కానీ వరుణ్ మాత్రం అలాంటి సన్నివేశంలోనూ తన నటనలో మెప్పించారు.

By - Tupaki Desk
Update: 2024-03-02 13:47 GMT

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్‌'. శక్తి ప్రతాప్ సింగ్ హుడా దర్శకత్వంలో ఈ ఏరియల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ తెరకెక్కింది. శుక్రవారం (మార్చి 1) థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఇందులో వరుణ్ పెర్ఫార్మెన్స్ కు అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

'ఆపరేషన్ వాలెంటైన్‌' సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ రుద్ర పాత్రలో వరుణ్ తేజ్ నటించారు. నటించాడు అనడం కంటే అతను జీవించాడు అని చెప్పాలి. IAF ఆఫీసర్ పాత్రకు మెగా హీరో సరిగ్గా సూట్ అయ్యారు. పాత్రకు తగ్గట్టుగా ఓవైపు ఇంటెన్స్ గా కనిపిస్తూనే, మరోవైపు ఎమోషన్స్ పండించారు. ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని కళ్లతోనే భావోద్వేగాలు పండించడం ఏ నటుడుకైనా అంత సులభం కాదు. కానీ వరుణ్ మాత్రం అలాంటి సన్నివేశంలోనూ తన నటనలో మెప్పించారు.

2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై జరిగిన ఉగ్ర దాడి, ఆ తర్వాత ఉగ్రవాదులపై భారత వైమానిక దళం ప్రతీకారం తీర్చుకోవడం వంటి రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాని తెరకెక్కించారు. ఇందులో ఫైటర్ పైలట్ పర్ఫెక్ట్ లుక్ కోసం వరుణ్ తేజ్ ట్రైనింగ్ తీసుకున్నారు. ఇది మేకింగ్ సమయంలో ఆయనకు ఎంతో సహాయపడింది.

అలానే వరుణ్ తేజ్ కొందరు రియల్ ఫైటర్ పైలట్స్ ను కలిసి వారి బాడీ లాంగ్వేజ్ ను అర్థం చేసుకున్నారు. ఫైటర్‌ ఫ్లైట్‌ ఎలా పనిచేస్తుంది? ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? తదితర వివరాలను సిమ్యులేటర్‌లో కూర్చుని మరీ తెలుసుకున్నారు. ఇవ‌న్నీ ఐఏఎఫ్ ఆఫీసర్ క్యారెక్టర్ ను పోషించడానికి అతనికి ఉపయోగపడ్డాయి. హిందీ డిక్సన్ పర్ఫెక్ట్ గా రావడం కోసం రెండు నెలలు ట్రైనింగ్ తీసుకొని, స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.

నిజానికి వరుణ్ తేజ్ మెగా ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ, కెరీర్ ప్రారంభం నుంచీ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే, ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటిస్తున్నారు. గత రెండు చిత్రాలు 'గని', 'గాండీవధారి అర్జున' ఫ్లాప్ అయినప్పటికీ, వరుణ్ మాత్రం తన వరకూ న్యాయం చేశారు. ఒక సినిమాలో బాక్సర్ గా, మరో చిత్రంలో ఏజెంట్ గా కనిపించడానికి ఎంతో కృషి చేశారు.

ఇప్పుడు 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాలో తన సైడ్ నుంచి వంద శాతం ఎఫెర్ట్ పెట్టారు వరుణ్ తేజ్. ఎంత చెయ్యాలో అంతా చేశారు. అందుకే విమర్శకుల ప్రశంసలతో పాటుగా సాధారణ ప్రేక్షకులు మన్ననలు కూడా పొందుతున్నారు. తన కటౌట్‌కి తగిన పర్ఫెక్ట్ క్యారెక్టర్, సబ్జెక్ట్ దొరికితే తప్పకుండా నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాబోయే సినిమాతో కచ్ఛితంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారని మెగాభిమానులు భావిస్తున్నారు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం ''మట్కా'' అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1958 - 1982 మధ్య కాలంలో వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌లో, యావత్ దేశాన్ని కదిలించిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వరుణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ మూవీ. ఇందులో మరో ఛాలెంజింగ్ రోల్ లో నటిస్తున్నారు. నాలుగు విభిన్నమైన గెటప్‌లలో కనిపించనున్నట్లు టాక్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ లో మెగా ప్రిన్స్ పూర్తిగా మేక్ఓవర్ తో సరికొత్త లుక్ లో ఆకట్టుకున్నారు.

Tags:    
  • Varuntej 
  • Operationvalentine 
  • Shaktipratapsingh 
  • Iafofficerm 
  • Fighterrudra 
  • Manushichhilar 

Similar News

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

Copyright @2026

Powered by Blink CMS