• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వరుణ్ తేజ్ ఆపరేషన్...

వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్.. ఇంత స్పిడా..

| ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే

By - Tupaki Desk
Update: 2023-08-14 08:49 GMT

మెగా హీరో వరుణ్ తేజ్ మళ్లీ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవ దారి అర్జున అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ఆగస్టు 25వ తేదీన విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కూడా కాస్త పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసింది.


ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే వరుణ్ తేజ్ నుంచి చివరగా వచ్చిన గని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. కాబట్టి ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని వరుణ్ తేజ్ అనుకుంటున్నాడు. ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ లిస్టులో ఉన్న మరొక సినిమా కూడా షూటింగ్ ను వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది.

ఆ మధ్య వరుణ్ తేజ్ ఒక ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా షూటింగ్ సైలెంట్ గానే ఫినిష్ చేస్తున్నారు. ఇక వరుణ్ తేజ్ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకురావాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఆ సినిమాకు సంబంధించిన టైటిల్ తో పాటు పోస్టర్ను కూడా ఇటీవల విడుదల చేశారు.

'ఆపరేషన్ వాలెంటైన్' అనే ఆ సినిమా నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించారు. వరుణ్ తేజ్ ఆ సినిమాలో ఐఏఎఫ్ అధికారిగా కనిపించబోతున్నాడు. ఇక మాజీ మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. శక్తి ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పోనీ పిక్చర్స్ భారీ బడ్జెట్లోనే నిర్మిస్తోంది.

తెలుగు హిందీలో ఒకేసారి విడుదల కాబోయే ఈ సినిమాను డిసెంబర్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈనెల 25వ తేదీన గాండీవదారి అర్జున సినిమాతో రాబోతున్న వరుణ్ తేజ్ మళ్లీ మూడు నెలలు తిరగకుండానే ఈ డిఫరెంట్ యాక్షన్ సినిమాతో త్రీల్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఈ మెగా హీరో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. మరి సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Varuntej 
  • Operationvalentine 
  • Shaktipratapsinghhada 
  • Operationvalentinefilm 
  • Ganddevadhariarjuna 
  • Praveensattaru 

Similar News

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

2026-11-10 06:55 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

'మాయ లేడీ' ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-10 06:09 GMT

రామాయ‌ణం పై బాలీవుడ్ స్టార్స్ సైలెన్స్!

2026-11-10 06:01 GMT

ప్లీజ్ ..రామాయణాన్ని ..రామాయణంగానే తీయండి..!

2026-11-10 06:00 GMT

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

Copyright @2026

Powered by Blink CMS