కొరియన్ కనకరాజు పార్ట్ 2.. ఓ క్లారిటీతో ఉన్న వరుణ్

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన హారర్ కామెడీ సినిమా 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Update: 2026-08-15 04:10 GMT

వరుణ్ తేజ్ హీరోగా దర్శకుడు మేర్లపాక గాంధీ తీసిన హారర్ కామెడీ సినిమా 'కొరియన్ కనకరాజు' బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. రీసెంట్‌గా ఈ చిత్ర యూనిట్ వైజాగ్‌లో ఒక సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ వేదిక మీద సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలోనే సీక్వెల్‌కు సంబంధించిన ఒక చిన్న అప్‌డేట్‌ను హీరో వరుణ్ తేజ్ మీడియాతో పంచుకున్నాడు.

కొన్ని రోజుల క్రితం జరిగిన ఈ సినిమా సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ పార్ట్ గురించి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. సీక్వెల్ కు ఒక వెరైటీ పేరు కూడా అనుకుంటున్నారని ఆయన చెప్పడంతో అప్పటి నుంచే జనాల్లో క్యూరియాసిటీ మొదలైంది. వైజాగ్ ఈవెంట్‌లో ఒక యాంకర్ సరిగ్గా ఇదే పాయింట్ మీద వరుణ్ ను సూటిగా ప్రశ్నించారు. అసలు పార్ట్ 2 ఆలోచన నిజంగా ఉందా లేక ఊరికే అన్నారా అని అడగడంతో అసలు విషయం బయటపడింది.

ఆ ప్రశ్నకు వరుణ్ తేజ్ బదులిస్తూ వైజాగ్‌లోనే నోవాటెల్ హోటల్‌లో కూర్చుని తాము పార్ట్ 2 గురించి ఒక బేసిక్ డిస్కషన్ మొదలుపెట్టామని చెప్పాడు. డైరెక్టర్ మేర్లపాక గాంధీ, కమెడియన్ సత్యతో కలిసి సీక్వెల్ ఐడియాల మీద సరదాగా మాట్లాడుకున్నామని తెలిపాడు. అంటే ఈ ప్రాజెక్ట్ ఆలోచన మేకర్స్ మైండ్ లో గట్టిగానే ఉందనే విషయాన్ని ఆయన ఓపెన్‌గానే ఒప్పేసుకున్నాడు.

ఆ డిస్కషన్‌లో భాగంగా అనుకుంటున్న ఒక ఫన్నీ టైటిల్‌ను కూడా వరుణ్ తేజ్ అక్కడే బయటకు చెప్పాడు. సెకండ్ పార్ట్ కోసం ప్రస్తుతానికి 'కెన్యా కనకరాజు' అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలిపాడు. ప్రమోషన్స్‌లో చిరంజీవి చెప్పిన ఆ వెరైటీ టైటిల్ ఇదేనని దీంతో క్లారిటీ వచ్చేసింది. అయితే ఇది కేవలం వర్కింగ్ ఐడియా మాత్రమేనని, ఆ పేరును అఫీషియల్ గా లాక్ చేయలేదని కూడా వరుణ్ వెంటనే చెప్పుకొచ్చాడు. ఒక ఫన్నీ ఫ్లేవర్ కోసమే ఆ పేరు అనుకున్నారట.

ఇక్కడ వరుణ్ తేజ్ సీక్వెల్స్ విషయంలో తన మైండ్ సెట్ ఎలా ఉందో సూటిగా చెప్పేశాడు. కేవలం ఒక సినిమా హిట్ అయింది కదా అని, ఆ క్రేజ్ వాడుకోవడానికి వెంటనే పార్ట్ 2 తీసేయాలనే తొందర తమకు అస్సలు లేదని చెప్పాడు. ప్రాపర్ వర్క్ జరిగి, ఒక మంచి స్క్రిప్ట్ కుదిరితేనే ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్ స్టెప్‌కు వెళ్తుందని తేల్చి చెప్పాడు. ఇక ఈ 'కెన్యా కనకరాజు' ఐడియా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, అసలు డైరెక్టర్ ఆ స్క్రిప్ట్ ఎలా పూర్తి చేస్తాడో చూడాలి.




Tags:    

Similar News