పిక్‌టాక్‌ : మెగా హీరో సర్‌ప్రైజింగ్‌ వర్కౌట్‌ లుక్‌

ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా మేర్లపాక గాంధీ సినిమాలో కనిపించేందుకు గాను రెడీ అవుతున్నాడు.;

Update: 2025-06-09 11:49 GMT

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ ఈ మధ్య కాలంలో వరుసగా ఫ్లాప్స్‌తో సతమతం అవుతున్నాడు. గత ఏడాదిలో ఈయన నటించిన ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా సినిమాలు వచ్చాయి. రెండు సినిమాలపై వరుణ్‌ చాలా ఆశలు పెట్టుకున్నాడు. కానీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. ఆ సినిమాల ఫలితంతో వరుణ్‌ తేజ్ తదుపరి సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని భావించినట్లుగా ఉన్నాడు. అందుకే ఇప్పటి వరకు తదుపరి సినిమా రాలేదు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా సినిమా రూపొందుతోంది. ఆ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ రెడీ అవుతున్నాడు. ఆ సినిమా కోసం ప్రత్యేకమైన లుక్‌కి రెడీ అవుతున్నారు.

 

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో వరుణ్‌ తేజ్‌కి జోడీగా రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరిద్దరి కాంబోలో రొమాంటిక్ సీన్స్ కచ్చితంగా మెప్పిస్తాయనే విశ్వాసంను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. అతి త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ వచ్చే అవకాశం ఉంది. కమెడియన్‌ సత్య ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో వినోదాత్మకంగా ఈ సినిమా ఉంటుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఈ సినిమాపై మెగా అభిమానుల్లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసం వ్యక్తం అవుతోంది.

హీరోగా వరుణ్‌ తేజ్‌ ఇప్పటి వరకు నటించిన సినిమాల్లో వైవిధ్యభరిత లుక్స్‌లో కనిపించాడు. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా మేర్లపాక గాంధీ సినిమాలో కనిపించేందుకు గాను రెడీ అవుతున్నాడు. అతి త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ రాబోతున్నాడు. సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ ఎక్కువ సమయం వర్కౌట్‌ చేయిస్తున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆయన ఫిజిక్‌ సైతం రెడీ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో వరుణ్‌ తేజ్‌ ఫోటోలను షేర్‌ చేశాడు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వరుణ్‌ తేజ్‌ మండే మోటివేషన్‌ అనే ట్యాగ్‌ పెట్టి తన జిమ్‌ ఫోటోలను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వరుణ్‌ తేజ్‌ లుక్‌ అదిరిందంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌ పొడవవాటి రింగుల జుట్టుతో పాటు, గడ్డంతో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. వరుణ్‌ తేజ్‌ ఈ ఫోటోలో వెనుక నుంచి కనిపించాడు. అయినా కూడా అతడి లుక్‌ విషయంలో చాలా మంది ఫిదా అవుతున్నారు. వరుణ్‌ తేజ్ వంటి హ్యాండ్సమ్‌ హంక్‌ కండలు పెంచి కనిపిస్తే, సిక్స్ ప్యాక్‌లో కనిపిస్తే అదిరి పోతుంది అంటూ అభిమానులతో పాటు అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోలు ఫిజిక్‌ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే వరుణ్‌ తేజ్‌ తానేం తక్కువ కాదు అంటూ మేర్లపాక గాంధీ సినిమా కోసం ఫిజికల్‌గా రెడీ అవుతున్నాడు. వరుణ్‌ తేజ్‌ సర్‌ప్రైజింగ్‌ లుక్‌ వైరల్‌ అవుతోంది.

Tags:    

Similar News