కొడుకు కోసం కేకును త‌యారు చేసిన యంగ్ హీరో

క వ‌రుణ్ తేజ్ కెరీర్ విష‌యానికొస్తే గత కొంత కాలంగా అత‌ని ఖాతాలో చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టీ లేదు.;

Update: 2025-12-12 12:44 GMT

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి కొన్నాళ్ల పాటూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మిస్ట‌ర్ సినిమా షూటింగ్ లో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారి అది పెళ్లి వ‌ర‌కు వెళ్లింది. 2023లో వీరిద్ద‌రూ ఇరు కుటుంబీకుల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకోగా, ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 10న వీరికి ఓ బాబు జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.

 

వ‌రుణ్- లావ‌ణ్య కొడుక్కి వాయువ్ తేజ్ అని పేరు

పెళ్లైన రెండేళ్ల‌కు వ‌రుణ్- లావ‌ణ్య త‌ల్లిదండ్రులవ‌గా త‌మ కొడుకుకు కొణిదెల కుటుంబానికి ఇష్ట దైవ‌మైన హ‌నుమంతుడి పేరు వ‌చ్చేలా వాయువ్ తేజ్ కొణిదెల అని పేరు పెట్టారు. ఆ వాయుపుత్రుడు ఆశీస్సుల‌తోనే త‌మ కొడుక్కి ఆ పేరు పెట్టినట్టు వ‌రుణ్, లావ‌ణ్య తెల‌ప‌గా, ఇప్ప‌టికే వాయువ్ తేజ్ పుట్టి మూడు నెల‌లు పూర్తైంది. ఈ సంద‌ర్భంగా ఈ దంపతులు త‌మ కొడుకు మూడో నెల బ‌ర్త్ డే ను మ‌రింత స్పెష‌ల్ గా సెల‌బ్రేట్ చేశారు.

మూడు నెల‌లు పూర్తి చేసుకున్న వాయువ్ తేజ్

వ‌రుణ్, లావ‌ణ్య త‌మ కొడుకు కోసం స్వ‌యంగా వారే ఓ బుజ్జి కేకును త‌యారు చేసి, దానిపై వినాయ‌కుడిని డిజైన్ చేసి ఎంతో క్యూట్ గా ఓ కేకును రెడీ చేసి కొన్ని ఫోటోల‌ను దిగ‌డంతో పాటూ ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేయ‌గా ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతుంది. అయితే ఈ వీడియోలో త‌మ కొడుకు ఫేస్ ను మాత్రం ఎక్కడా క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు వ‌రుణ్, లావ‌ణ్య‌.

ఇక వ‌రుణ్ తేజ్ కెరీర్ విష‌యానికొస్తే గత కొంత కాలంగా అత‌ని ఖాతాలో చెప్పుకోద‌గ్గ హిట్ ఒక్క‌టీ లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు క‌ష్ట‌ప‌డి సినిమాలైతే చేస్తున్నారు కానీ అదేదీ వ‌రుణ్ కు మంచి ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోతుంది. కాగా ప్ర‌స్తుతం వ‌రుణ్ తేజ్, వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ ఫేమ్ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమాపైనే త‌న ఆశ‌ల‌న్నింటినీ పెట్టుకున్నారు.

Tags:    

Similar News