ఫ్లాప్ డైరెక్టర్ తో మెగా ప్రిన్స్ సినిమా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. అతనెంత కష్టపడి సినిమాలు చేసినా ఆ కష్టమంతా వృధానే అవుతుంది.;
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు గత కొన్ని సినిమాలుగా ఫ్లాపులే ఎదురవుతున్నాయి. అతనెంత కష్టపడి సినిమాలు చేసినా ఆ కష్టమంతా వృధానే అవుతుంది. కొంత కాలంగా సరైన హిట్ లేక కెరీర్ లో ఇబ్బంది పడుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ డైరెక్టర్ మేర్లపాక గాంధీతో ఓ హార్రర్ కామెడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కూడా అయింది. అనౌన్స్‌మెంట్ వీడియోతోనే సినిమాపై మంచి ఇంట్రెస్ట్ కలిగించారు చిత్ర మేకర్స్. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కొరియన్ కనకరాజు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో వరుణ్ సరసన రితికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీతో ఎలాగైనా సాలిడ్ హిట్ అందుకుని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజు సినిమాను యువి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాపై వరుణ్ చాలానే ఆశలు పెట్టుకున్నాడని ఆయన సన్నిహితులంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ తో రాధేశ్యామ్ తీసి ఫ్లాపు ను మూటగట్టుకున్న రాధాకృష్ణ దర్శకత్వంలో వరుణ్ తేజ్ సినిమా చేయనున్నాడట. రాధేశ్యామ్ రిలీజై ఇంత కాలమవుతున్నా రాధాకృష్ణ తన తర్వాతి సినిమాను ఇప్పటివరకు అనౌన్స్ చేసింది లేదు.
మొన్నటివరకు గోపీచంద్ తో సినిమా చేస్తాడన్నారు కానీ దాని గురించి ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవలే వరుణ్ కు రాధాకృష్ణ ఓ లవ్ స్టోరీ చెప్పాడని, ఆ కథ వరుణ్ కు విపరీతంగా నచ్చిందని అంటున్నారు. గత కొంత కాలంగా ప్రయోగాలు చేస్తున్న వరుణ్ ను లవ్ స్టోరీలు చేయమని ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. మొత్తానికి వరుణ్ ఇప్పుడు ఫ్యాన్స్ కోరిక మేరకు మరోసారి లవ్ స్టోరీ చేయబోతున్నట్టు తెలుస్తోంది.