లవ్ స్టోరీ VS పోలీస్ థ్రిల్లర్.. మధ్యలో డిఫరెంట్ కాన్సెప్ట్..!

అక్టోబర్ మొదటి వారం అదే అక్టోబర్ 1, 2 తారీఖులలో దసరా ఫెస్టివల్ సందర్భంగా భారీ సినిమాలు రిలీజ్ చేశారు.;

Update: 2025-10-08 08:10 GMT

అక్టోబర్ మొదటి వారం అదే అక్టోబర్ 1, 2 తారీఖులలో దసరా ఫెస్టివల్ సందర్భంగా భారీ సినిమాలు రిలీజ్ చేశారు. అంతకుముందు వారం క్రితమే పవర్ స్టార్ ఓజీ రిలీజైంది. ఆ నెక్స్ట్ అక్టోబర్ 1న ధనుష్ ఇడ్లీ కొట్టు, 2న రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 రిలీజైంది. కాంతారా 1 సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక అక్టోబర్ మొదటి రెండు రోజుల్లోనే సినిమాలు రిలీజ్ కాగా రెండో వారం అంటే అక్టోబర్ 10న పెద్ద సినిమాల రిలీజ్ లు ఏవి ప్లాన్ చేయలేదు.

వరుణ్ సందేశ్ లీడ్ రోల్ లో..

కానీ ఈ వీకెండ్ బాక్సాఫీస్ ఫైట్ కి చిన్న సినిమాలు కొన్ని రంగంలోకి దిగుతున్నాయి. అందులో కానిస్టేబుల్ సినిమా ఒకటి ఉంది. వరుణ్ సందేశ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా అది. ఈ సినిమా క్రైం థ్రిల్లర్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని తెలుస్తుంది. వరుణ్ సందేశ్ కి అసలేమాత్రం మార్కెట్ లేదు అయినా కూడా కానిస్టేబుల్ సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా తో పాటు కోమలీ ప్రసాద్, రక్షిత్ అట్లూరి కలిసి నటించిన శశివదనే రిలీజ్ అవుతుంది.

అహితేజ నిర్మించిన ఈ లవ్ స్టోరీ చాలా కాలం వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఈ వీకెండ్ థియేటర్ లో సందడి చేస్తుంది. ఈ సినిమాతో పాటు సైకలాజికల్ థ్రిల్లర్ అరి కూడా వస్తుంది. ఈ సినిమాలో కాస్టింగ్ కాస్త భారీగానే ఉంది. సాయికుమార్, వైవా హర్ష, అనసూయ లాంటి వాళ్లు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాల ప్రమోషనల్ కంటెంట్ కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నాయి. శశివదనే టీం తమ లవ్ స్టోరీ సంథింగ్ స్పెషల్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. కోమలి ప్రసాద్ హిట్ సీరీస్ లతో కాస్త ఐడెంటిటీ తెచ్చుకుంది.

ఏ సినిమాకు ప్రేక్షకులు తమ ఆమోద ముద్ర..

ఈ 3 సినిమాల్లో ఏ సినిమాకు ప్రేక్షకులు తమ ఆమోద ముద్ర వేస్తారన్నది చూడాలి. ఐతే ఈమధ్య స్టార్ సినిమాలకు కూడా థియేటర్లు వెళ్లి చూసే పరిస్థితి కనిపించలేదు. ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమా తప్పకుండా చూసేయాలి అనిపించే రేంజ్ ప్రమోషన్స్ చేస్తేనే థియేటర్ వైపు అడుగులు వేస్తున్నారు. రిలీజ్ కాబోతున్న ఈ వీకెండ్ సినిమాలకు బజ్ ఐతే నామమాత్రంగానే ఉంది.

ఐతే రిలీజైన సినిమాల్లో చిత్ర యూనిట్ సిన్సియర్ ఎఫర్ట్ కనిపిస్తే మాత్రం ప్రేక్షకులు దాన్ని మౌత్ టాక్ తో హిట్ చేస్తున్నారు. ముందు థియేటర్ లో సైలెంట్ గా వచ్చినా సరే ఆడియన్స్ సూపర్ అనేలా చేస్తేనే అలాంటి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి.

Tags:    

Similar News