తెలుగు రాకపోయినా ఆ సినిమా 50 సార్లు చూశా
సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన వర్ష బొల్లమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు.;
సపోర్టింగ్ రోల్స్ తో కెరీర్ ను స్టార్ట్ చేసిన వర్ష బొల్లమ్మ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారారు. మిడిల్ క్లాస్ మెలోడీస్, ఊరి పేరు భైరవకోన, స్వాతి ముత్యం లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు వర్ష బొల్లమ్మ. ఇప్పుడు తమ్ముడు సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చిన వర్ష ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించారు.
తమ్ముడు మూవీలో సప్తమి గౌడ మెయిన్ హీరోయిన్ గా నటించగా, వర్ష బొల్లమ్మ మరో ఫీమేల్ లీడ్ గా నటించారు. శుక్రవారం తమ్ముడు సినిమా రిలీజవగా, ఈ సినిమాలో వర్ష యాక్టింగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తమ్ముడు సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొన్న వర్ష బొల్లమ్మ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు.
ఈ ప్రమోషన్స్ లో వర్ష బొల్లమ్మ తన వ్యక్తిగత విషయాలతో పాటూ ఆమె ఇష్టాలను కూడా బయటపెట్టారు. తాను రవితేజ విక్రమార్కుడు సినిమాను 50 సార్లు చూశానని, సమ్మర్ హాలిడేస్ లో తాను 50 రోజులు తన కజిన్ వాళ్ల ఇంటికి వెళ్లగా అక్కడ తన కజిన్ సిస్టర్ ప్రతీ రోజూ విక్రమార్కుడు సినిమా చూసేదని, తన కజిన్ వల్ల తాను కూడా విక్రమార్కుడు సినిమాను చూడాల్సి వచ్చిందని వర్ష బొల్లమ్మ తెలిపారు.
అప్పట్లో డీవీడీలు ఉండటంతో క్యాసెట్ వేసుకుని దాదాపు తాను ఉన్నన్ని రోజులు తన కజిన్ ఒకే సినిమాను చూసిందని, విక్రమార్కుడు లోని సాంగ్స్ అంటే తన కజిన్ కు ఎంతో ఇష్టమని, పాటల కోసం ప్రతీ రోజూ సినిమా మొత్తాన్ని చూసేదని, ఒకవేళ సినిమా వేయకపోతే ఆ రోజు ఆమెకు చాలా కోపం వచ్చేదని, దీంతో చేసేదేమీ లేక తాను కూడా విక్రమార్కుడు సినిమాను చూశానని వర్ష తెలిపింది. అయితే ఆ సినిమా చూసేటప్పుడు తనకు ఎక్కువగా తెలుగు రాదని, కానీ ఆ సినిమాలోని డైలాగ్స్ మొత్తం తనకు గుర్తున్నాయని, తెలుగు రాకపోయినా రెండు మూడు సార్లు చూశాక విక్రమార్కుడు సినిమా చాలా అద్భుతంగా అనిపించిందని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు వర్ష బొల్లమ్మ.