'వారణాసి'తో తెలుగు బాక్సాఫీస్‌కు కొత్త బెంచ్‌మార్క్!

కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్ అయితే ఈ లెక్క ఇంకా పైకి వెళ్లొచ్చని చెబుతున్నాయి. దసరా తర్వాత ఏరియాల వారీ డీల్స్‌పై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందట.

Update: 2026-09-30 06:13 GMT

రాజమౌళి సినిమా రిలీజ్‌కు ఇంకా టైమ్ ఉన్నా ‘వారణాసి’ బిజినెస్ లెక్కలు మాత్రం ఇప్పటికే టాలీవుడ్‌లో పెద్ద టాపిక్‌గా మారుతున్నాయి. మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ రూ.270 కోట్లకు పైగా వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. కొన్ని ట్రేడ్ రిపోర్ట్స్ అయితే ఈ లెక్క ఇంకా పైకి వెళ్లొచ్చని చెబుతున్నాయి. దసరా తర్వాత ఏరియాల వారీ డీల్స్‌పై పూర్తి క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందట.

ఈ నంబర్ ఎందుకు అంత పెద్దదంటే.. ‘RRR’ తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.224 కోట్ల వరకు వెళ్లింది. ‘పుష్ప 2’ విషయంలో ట్రేడ్ లెక్కలు రూ.213 నుంచి రూ.220 కోట్ల మధ్య ఉన్నాయి. ఇప్పుడు ‘వారణాసి’ రూ.270 కోట్ల మార్క్ అంటే మామూలు విషయం కాదు. టాలీవుడ్ మార్కెట్ వాల్యూ మరో 50 కోట్ల వరకు ఎక్కువ రేంజ్‌లోకి వెళ్లినట్టే. అదే జరిగితే తెలుగు మార్కెట్‌లో కొత్త బెంచ్‌మార్క్ పడినట్టే.

అయితే బిజినెస్ లెక్కల కంటే ఆ సినిమాలు చివరకు ఎంత తెచ్చాయన్నది ఇంకా ఇంట్రెస్టింగ్. ‘RRR’ తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో సుమారు రూ.269.8 కోట్ల షేర్ సాధించింది. ‘పుష్ప 2’ కూడా సుమారు రూ.213 కోట్ల షేర్ వరకు వెళ్లింది. ఇప్పుడు ‘వారణాసి’ బిజినెస్‌నే రూ.270 కోట్లకు పైగా పెట్టుకుంటే, బయ్యర్లు సేఫ్ కావాలంటే ఇక్కడ ఇప్పటివరకు చూసిన రికార్డ్ షేర్‌ను కూడా దాటాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ చూడని నెంబర్స్ రావొచ్చనే అంచనాలు మొదలయ్యాయి.

మహేష్ బాబు మార్కెట్‌కు రాజమౌళి బ్రాండ్ కలవడం ఈ లెక్కలకు అసలు బలం. ‘RRR’ తర్వాత రాజమౌళి పేరు ఇండియా దాటి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో కూడా బలంగా వెళ్లింది. మహేష్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బేస్ గురించి చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్‌కు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పేర్లు కూడా చేరడంతో ‘వారణాసి’ మొదటి నుంచే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా నిలబడుతోంది.

మరోవైపు భారీ రేట్లకు రైట్స్ తీసుకునే బయ్యర్లకు మొదటి వీకెండ్ ఓపెనింగ్స్ మాత్రమే సరిపోవు. రూ.270 కోట్లకు పైగా బిజినెస్ జరిగితే సినిమా లాంగ్ రన్‌లో కూడా అదే స్థాయి ఊపు చూపించాల్సి ఉంటుంది. టికెట్ రేట్లు, అదనపు షోలు, హాలిడే అడ్వాంటేజ్, రిపీట్ ఆడియన్స్.. అన్నీ కలిసి వస్తేనే ఆ రేంజ్ రికవరీ సాధ్యమవుతుంది. అందుకే ఈ బిజినెస్ నెంబర్ రికార్డ్‌తో పాటు పెద్ద టార్గెట్‌ను కూడా తీసుకొస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి పూర్తి స్థాయి ప్రమోషన్ కూడా మొదలుకాలేదు. రిలీజ్‌కు ఇంకా 6 నెలలు ఉండగానే తెలుగు రైట్స్ కోసం ఇంత పెద్ద లెక్కలు తిరుగుతున్నాయంటే, రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి హైప్ ఇంకెక్కడికి వెళ్తుందన్నది చూడాలి.

Tags:    

Similar News