• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూడు నెలలు లేట్ గా...

మూడు నెలలు లేట్ గా వైష్ణవ్ తేజ్

| మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు

By - Tupaki Desk
Update: 2023-08-04 05:18 GMT

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నారు. తరువాత క్రిష్ తో కొండపొలం సినిమా చేశారు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. తరువాత రంగరంగ వైభవంగా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాగా అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. అతని నాలుగో చిత్రంగా ఆదికేశవ మూవీ తెరకెక్కింది. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో సిద్ధమైన ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.

శ్రీలీల ఈ మూవీలో వైష్ణవ్ తేజ్ కి జోడీగా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ నిజానికి ఆగష్టులోనే రిలీజ్ కావాల్సి ఉంది. డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. ఆగష్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా పడింది.

శ్రీలీల బర్త్ డే సందర్భంగా ఓ చిన్న టీజర్ రిలీజ్ చేశారు. అయితే మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా చాలా పూర్తికావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 10న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. ఈ రిలీజ్ డేట్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. వైష్ణవ్ తేజ్ నుంచి కంప్లీట్ కమర్షియల్ జోనర్ లో వస్తోన్న మూవీ ఆదికేశవ.

ఈ కారణంగా సినిమాపై అతను చాలా హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా ఆదికేశవతో సక్సెస్ అందుకోవడంతో తన మీద ఉన్న బ్యాడ్ రిమార్క్ ని చెరిపేసుకోవాలని అనుకుంటున్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఏ హీరో కూడా ఆరంభంలో ఇలా బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ కొట్టలేదు. మరి ఆదికేశవ ఆ హిట్ తో తన ఫేట్ కూడా మారిపోతుందని ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు.

మరి ఈ మూవీ అతనికి ఎలాంటి హిట్ ఇస్తుందనేది చూడాలి. ఇక దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మంచు మనోజ్ తో అహం బ్రహ్మాస్మి అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఏమైందో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టి ఆదికేశవ చేస్తున్నారు. ఈ చిత్రం సక్సెస్ అయితే ఒక పెద్ద హీరోతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

Tags:    
  • Vaishnavtej 
  • Adikeshava 
  • Sreeleela 
  • Uppena 
  • Adikeshavamovie 
  • Srikanthreddy 
  • Manchumanoj 
  • Vaishnav 

Similar News

రామ్, జెనీలియా స్నేహం.. ఇప్పటికీ అదే అనుబంధం!

2026-11-08 06:32 GMT

బ్లాక్ శారీలో తృప్తి డిమ్రీ మెరుపులు.. దీపావళి పార్టీ లుక్ వైరల్!

2026-11-08 06:11 GMT

పెద్ద రహస్యం బయటపెడతాను అంటున్న స్టార్ హీరో..!

2026-11-08 06:01 GMT

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

Copyright @2026

Powered by Blink CMS