దేవకన్యలా.. మిత్రవిందగా.. బేబీ లుక్కు అదిరింది..!
అమ్మడు హీరోయిన్ గా నటించిన ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అందుకుంది.;
షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ బేబీతో హీరోయిన్ గా సూపర్ హిట్ అందుకున్న భామ వైష్ణవి చైతన్య. అమ్మడు హీరోయిన్ గా నటించిన ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అందుకుంది. ఐతే సెకండ్ మూవీగా చేసిన లవ్ మీ సినిమా మాత్రం ఫెయిల్ అయ్యింది. అయినా సరే అమ్మడు ఏమాత్రం జోష్ తగ్గకుండా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ తో జాక్ సినిమా చేస్తుంది వైష్ణవి చైతన్య.
ఆ సినిమాలో సిద్ధు తో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా చేస్తున్నట్టుగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా కాబట్టి వైష్ణవి చైతన్య లక్కీగా ఫీల్ అవుతుంది. ఇక సినిమాలతో పాటు సోషల్ మీడియాలో తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది వైష్ణవి చైతన్య. రకరకాల ఫోటో షూట్స్ తో ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది.
లేటెస్ట్ గా అమ్మడు దేవకన్యగా మారి ఫోటో షూట్ చేసింది. పండగ వైబ్ ని మరింత పెంచేలా వైష్ణవి లుక్ ఉంది. ముఖ్యంగా ఒక మహారాణి లుక్ తో కనిపిస్తుంది వైష్ణవి చైతన్య. ఈ ఫోటోలు చూసిన చాలామంది మగధీరలో మిత్రవిందకు ఏమాత్రం తీసిపోదనేలా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. నిజమే అమ్మడి ఫోటో షూట్ ప్లానింగ్స్ ఎవరు ఇస్తున్నారో కానీ యువరాణి గెటప్ లో వైష్ణవి నిజంగానే దేవకన్యలానే కనిపిస్తుంది.
జాక్ సినిమా హిట్ పడితే అమ్మడి కెరీర్ కు కాస్త బూస్టింగ్ వస్తుంది. ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా సోషల్ మీడియా ఫోటో షూట్స్ తో హంగామా చేస్తుంది వైష్ణవి చైతన్య. సో అందుకే ఆమె ఫోటో షూట్స్ కి స్పెషల్ క్రేజ్ ఏర్పడుతుంది. అంతేకాదు తన టీం కూడా వైష్ణవిని సోషల్ మీడియాలో బాగా బూస్ట్ చేస్తుంది. తప్పకుండా వైష్ణవికి ఇదంతా కలిసి వచ్చేలా ఉందని చెప్పొచ్చు.
జాక్ సినిమా రిజల్ట్ ఏదైనా సరే వైష్ణవి తన ఫోటో షూట్స్ తో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది. అందుకే ఆమె ఇలా ఫోటోస్ షేర్ చేయగానే అలా వైరల్ అవుతున్నాయి. తెలుగు అమ్మాయికి ఇక్కడ మంచి అవకాశాలు వస్తే మరికొంతమంది సినిమాల్లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే వారిలో కాన్ఫిడెన్స్ నింపేందుకు వైష్ణవి తన కెరీర్ బిల్డ్ చేసుకుంటుంది.