పవన్ 'ఉస్తాద్'.. కథ విషయంలో అంత జరిగిందా?
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. రీసెంట్ గా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలా సాంగ్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.;
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలో హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలతో సందడి చేసిన ఆయన.. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో థియేటర్స్ లోకి రానున్నారు. వచ్చే ఏడాది ఆ మూవీ గ్రాండ్ గా విడుదల అవ్వనుంది.
అయితే ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. రీసెంట్ గా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ దేఖ్లేంగే సాలా సాంగ్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది.
ఆ పాటను విడుదల చేయడానికి ఈవెంట్ ఏర్పాటు చేయగా.. సినిమా కోసం హరీష్ శంకర్ మాట్లాడారు. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి.. ఆలస్యమవుతూ వచ్చి ఇప్పుడు రిలీజ్ కు సిద్ధమవుతోంది. దానికి తోడు తేరీ సినిమా రీమేక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆ విషయాలపై డైరెక్టర్ హరీష్ శంకర్ స్పష్టత ఇచ్చారు.
సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చాయని, పవన్ కళ్యాణ్ వల్ల మూవీ లేట్ అయిందని తప్పుడు కథనాలు వచ్చాయని చెప్పారు. కానీ ఆయన వల్ల అస్సలు ఆలస్యం కాలేదని తెలిపారు. కథ విషయంలో మార్పులు వల్లే సినిమా బాగా లేట్ అయిందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు స్టోరీ ఛేంజ్ చేశామని అన్నారు.
సినిమాలో పవన్ ను కాలేజీ స్టోరీలో చూపించాలని ఫిక్స్ అయ్యి.. ముందుగా స్టోరీ రాసుకున్నానని తెలిపారు. కానీ మొత్తం అయ్యాక ఎందుకో క్లాసీగా అనిపించిందని అన్నారు. అందుకే దాన్ని డ్రాప్ చేశామని అన్నారు. ఆ తర్వాత కోవిడ్ పాండమిక్ వల్ల ఇబ్బంది పడ్డానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత కోలుకున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు.
ఇక అప్పుడు పవన్ తో రీమేక్ చేద్దామని ఫిక్స్ అయ్యానని, కానీ ఆ స్టోరీపై చాలా డౌట్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో ఇంకో కథను రాసుకున్నానని తెలిపారు. తద్వారా రీమేక్ కాదని పరోక్షంగా స్పష్టం చేశారు. ఏదేమైనా పవర్ స్టార్ కు తగ్గ స్టోరీతో సినిమా చేసినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ సహకారంతో చాలా స్పీడ్ గా మూవీ షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు. ఆయన వల్ల త్వరగా కంప్లీట్ అయిందని చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.