అభిమానులతో ఊర్వశీ రౌతేలా సెల్పీ సరసం!
బాలీవుడ్ ఐటం బాంబ్ ఊర్వశీ రౌతేలా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు చిత్రాల్లో అమ్మడు మంచి ఫాలోయింగ్ సంపాదించింది.;
బాలీవుడ్ ఐటం బాంబ్ ఊర్వశీ రౌతేలా క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు చిత్రాల్లో అమ్మడు మంచి ఫాలోయింగ్ సంపాదించింది. బ్యూటీ కనిపిస్తే చాలు సెల్పీలంటూ అభిమానులు మీద మీదకు ఎగబడతారు. ఒక్క సెల్పీ ప్లీజ్ అంటూ వెంట పడతారు. తాజాగా ఓ ఈవెంట్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో అభిమానులకు వింత అనుభవాన్ని పంచింది. రెడ్ కార్పెట్ పై నడుచుకుంటూ వెళ్లిపోతున్న ఊర్శశిని అక్కడున్న అభిమానులు ఒక్కోక్కరు సెల్పీ ప్లీజ్ అంటూ ఫోన్లు తీసుకుని చేతిలో పెట్టుకున్నారు.
వాటిని చూసిన ఊర్వశీ వారిని ఏమాత్రం నిరుత్సాహ పరచకుండా చిరు నవ్వులు చిందిస్తూ ఒక్కొక్కరి ఫోన్ చేతిలోకి తీసుకుని కొంత దూరం వెళ్లిపోయింది. ఆ సన్నివేశం చూసి ఫోన్లు ఇచ్చిన వారంతా తెగ మురిసి పోయారు. దగ్గరకు పిలిచి సెల్పీలు ఇస్తుందనుకున్నారంతా. కానీ సెల్పీ ఇవ్వకపోయినా? పర్వాలేదు తమ ఫోన్లు తన అందమైన చేతుల్లోకి తీసుకుంది? అన్న సంతోషానికి గురయ్యారు. ఇది సెల్పీ ని మించిన సంతోషమంటూ చుట్టూ ఉన్న వారంత పగలబడి నవ్వారు. మళ్లీ ఆఫోన్లను అక్కడున్న వ్యక్తికి ఇచ్చి ఎవరి ఫోన్లను వారికి ఇచ్చేయమని సూచించింది.
ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలను సెల్పీలు అడుగుతుంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నారు. కొందరు ఖరీదైన ఫోన్లను నేలకేసి బాదుతున్నారు. ఇంకొంత మంది లాక్కూని విసిరేస్తున్నారు. మరికొంత మంది సెల్పీలు అడిగిన వారి ఇదేం పిచ్చి అంటూ చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఉర్వశీ అలాంటి పనులు చేయకుండా సెల్పీ ఇవ్వకపోయినా? అక్కడున్న వారందర్నీ కాసేపు నవ్వించడం సెల్పీని మించిన సంతోషాన్ని అందించింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక ఊర్వశీ సినిమాల విషయానికి వస్తే బాలీవుడ్ లో బిజీగానే ఉంది. వరుసగా మూడు ప్రాజెక్ట్ లకు పని చేస్తుంది. `వెల్కమ్ టూ ది జంగిల్`, `కసూర్ 2` లో నటిస్తోంది. వాటితో పాటు మరో కొత్త సినిమాకు సైన్ చేసింది. తెలుగులో `బ్లాక్ రోజ్` లో ఆడిపాడుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. సెట్స్ కి వెళ్లా చాలా కాలమైన అనివార్య కారణాలతో ఆలస్యమవుతుంది. ఈ బ్యూటీ `ఏజెంట్`, `బ్రో`, `డాకు మహారాజ్` లాంటి చిత్రాల్లో పెర్పార్మ్ చేసిన సంగతి తెలిసిందే.