ఉర్పీ జావెద్ ని టాలీవుడ్ కి తెస్తున్నారా?

ఉర్పీ కూడా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌దు. ఆఫ్ ది స్క్రీన్ లో నే చిచ్చ‌ర పిడుగులా చెల‌రే గిన బ్యూటీ ఆన్ ది స్క్రీన్ పై ఆగుతుందా?;

Update: 2025-07-05 17:30 GMT

ఉర్పీ జావెద్ ప‌రిచ‌యం అవ‌స‌రంలేని పేరు. బాలీవుడ్ లో సినిమాలు చేయ‌లేదు. కానీ సోష‌ల్ మీడియాలో ఎంతో ఫేమ‌స్ . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని మించిన ఫాలోయింగ్ ఉర్పీ సొంతం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. వింతైన డిజైన‌ర్ దుస్తుల్లో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌లో తానో సంచ‌ల‌నం. డిజైన‌ర్ దుస్తుల్లో రొడ్డెక్కిందంటే? అక్క‌డ ట్రాపిక్ జామ్ అవ్వాల్సిందే. ఇన్ స్టా హీటెక్కాల్సిందే. డ్యాష్ అండ్ డేరింగ్ గాళ్. త‌న‌దారికి అడ్డొస్తే సెల‌బ్రిటీల‌నే ఎదురిస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటుంది.

ఇలాంటి వివాదాలు అమ్మ‌డి పేరిట చాలానే ఉన్నాయి. శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రా తో కూడా త‌గాదాకి దిగిన సంగ‌తి తెలిసిందే. ఇలా ఇంత ఫేమ‌స్ అయినా అమ్మ‌డికి బాలీవుడ్ లో మాత్రం ఇప్ప‌టికీ అవ‌కాశాలు రాలేదు. కొన్ని టీవీ షోలు..వెబ్ సిరీస్ లు చేసింది. సినిమా ఛాన్స‌లు మాత్రం రాలేదు. ఈ నేప‌థ్యంలో ఉర్పీ ని టాలీవుడ్ కి తీసుకొచ్చే బాధ్య‌త‌ను ఓ ద‌ర్శ‌క‌, నిర్మాత తీసుకున్నాడుట‌. ఉర్పీని హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచ‌న‌తో ముంబై వైపు మ‌ళ్లిన‌ట్లు స‌మాచారం.

ఆ ద‌ర్శ‌క‌, నిర్మాత వెనుక మ‌రో దర్శ‌కుడి హ‌స్తం కూడా ఉందిట‌. సోష‌ల్ మీడియాలో ఉర్పీ ఫాలోయింగ్ చూసే ఈ ఛాన్స్ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఉర్పీని ఎలాంటి పాత్ర‌లో చూపిస్తారో చూడాలి. ఉర్పీ కూడా అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏమాత్రం వెన‌క‌డుగు వేయ‌దు. ఆఫ్ ది స్క్రీన్ లో నే చిచ్చ‌ర పిడుగులా చెల‌రేగిన బ్యూటీ ఆన్ ది స్క్రీన్ పై ఆగుతుందా? ఆ ద‌ర్శ‌క , నిర్మాత‌లిద్ద‌రు కూడా హీరోయి న్ల‌ను అందంగా చూపించడంలో ఎక్స్ ప‌ర్ట్ లే.

గ‌తంలో కొన్ని బోల్డ్ అటెంప్ట్ లు చేసిన అనుభ‌వం కూడా ఉంది. ఉర్పీ ఇమేజ్ కూడా ఈ న‌యా డైరెక్ట‌ర్ల‌కు బాగానే వ‌ర్కౌట్ అవుతుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో? తేలాలి. అలాగే ఈ అవ‌కాశం నిజ‌మే అయితే? ఉర్పీ జావెద్ రియాక్ష‌న్ ఎలా ఉంటుంది? అన్న‌ది అంతే ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News