• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వారానికి ఒక‌సారి హ‌బ్బీతో...

వారానికి ఒక‌సారి హ‌బ్బీతో ఉపాస‌న డేట్ నైట్

| ఒక బిడ్డ తల్లి అయినా కానీ ఉపాస‌న వారానికి ఒక‌సారైనా త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ తో డేట్ నైట్ ప్లాన్ చేస్తాన‌ని తెలిపారు.

By - Sivaji Kontham
Update: 2025-10-03 17:30 GMT

భార్యా భ‌ర్త‌లు ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఎలా ఉండాలి? అపార్థాలు, క‌ల‌త‌లు లేకుండా జీవించాలంటే... దానికి చ‌క్క‌ని స‌మాధానం ఇచ్చారు ఉపాస‌న కొణిదెల. భ‌ర్త‌తో విలువైన స‌మ‌యం గ‌డ‌ప‌డం.. వ‌ర్క్- లైఫ్ స‌మ‌తుల్య‌త‌ను సాధించ‌డం గురించి స్ప‌ష్ఠ‌మైన విధానాన్ని క‌లిగి ఉన్నారు ఉపాస‌న‌.

ఒక బిడ్డ తల్లి అయినా కానీ ఉపాస‌న వారానికి ఒక‌సారైనా త‌న భ‌ర్త రామ్ చ‌ర‌ణ్ తో డేట్ నైట్ ప్లాన్ చేస్తాన‌ని తెలిపారు. వారానికోసారి ఇలా ఉండాలని మా అమ్మ మాకు చెప్పేది. దాని ప్రాముఖ్యత అప్పుడు అర్థం కాలేదు.. కానీ అది చాలా ముఖ్యం. మేం వీలైనంత వరకు డేట్ నైట్ ప్రయత్నిస్తాము`` అని అన్నారు.

డేట్ నైట్ అంటే బ‌య‌ట‌కు వెళ్ల‌డమా? లేక ఇంట్లోనే ఉండ‌ట‌మా? ఒక‌వేళ ఇంట్లోనే ఉంటే వేరే ఏ పరధ్యానం లేకుండా.. ఫోన్లు - టీవీతో గ‌డిపేయ‌కుండా.. ఒకరినొకరు చూసుకుంటూనే ఉంటాం. మా ఇద్ద‌రిలో ఎవ‌రో ఒకరితో స‌మ‌స్య ఉంటే క‌చ్ఛితంగా దాని గురించి మాట్లాడుకుంటాం. కమ్యూనికేషన్ అనేది చాలా ముఖ్య‌మైన‌ది. ఎప్ప‌టికీ మనం చనిపోయే వరకు నిర్మించుకుంటూనే ఉండేది క‌మ్యూనికేష‌న్`` అని తెలిపారు.

నేటి జీవన ప్ర‌యాణంలో ఎలాంటి అంతరాయాలు లేకుండా నాణ్యమైన సమయాన్ని కలిసి గడపడానికి ప్రతి వారం ఒక సాయంత్రం కేటాయించాలని డాక్టర్లు కూడా స‌ల‌హా ఇస్తున్నారు. రొమాంటిక్ డిన్నర్ కోసం బయటకు వెళ్లడం, సినిమా చూడటం, ఇద్ద‌రికీ న‌చ్చిన ప‌నులు చేయ‌డం.. క‌లిసి వంట చేయ‌డం, ఇంట్లో అర్థవంతమైన మాట‌లు, ఆట‌లు వంటివి కూడా భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య ప్ర‌తిదీ స‌మ‌తుల్యం చేస్తాయని ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిపుణులు సూచిస్తున్నారు. చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో పెద్ది చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. వ‌ర్క్ లైఫ్ బిజీ ఉన్నా కానీ, వారానికి ఒక‌సారి ఉపాస‌నతో ఔటింగ్ కోసం త‌న డేట్ కేటాయిస్తార‌ని ఇప్పుడు క్లారిటీ వ‌చ్చింది.

Tags:    
  • UpasanaKonidela 
  • RamCharan 
  • CoupleGoals 
  • MarriageTips 
  • DateNight 
  • WorkLifeBalance 
  • TeluguCelebrities 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS