ఉపాసనకు మెగాస్టార్ చెప్పిన పెరుగు సీక్రెట్..!

పెరుగు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో ఉపాసన అత్తంటికి వెళ్లాక మార్చుకుందని తెలుస్తుంది.;

Update: 2025-08-11 07:26 GMT

మెగా కోడలు ఉపాసన పెళ్లైన కొత్త తన ఫుడ్ హ్యాబిట్స్ తో చిరంజీవిని షాక్ అయ్యేలా చేసిందట. అందరు కలిసి లంచ్ చేద్దామని కూర్చున్నప్పుడు ఉపాసన ముందు కర్డ్ రైస్ తినేదట. ఆ తర్వాత మిగతా కర్రీస్ తో తినేదట. అది చూసిన చిరంజీవి ముందు కర్డ్ రైస్ చివరగా తినాలని అన్నారట. అప్పటి నుంచి తను అదే ఫాలో అవుతున్నా అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఉపాసన. ఉపాసన ఒక స్టార్ వైఫ్ గానే కాదు ఒక బిజినెస్ ఉమెన్ గా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది.

చరణ్, ఉపాసన అండర్ స్టాండింగ్ కపుల్..

చరణ్, ఉపాసన ఇద్దరు మంచి అండర్ స్టాండింగ్ కపుల్. ఇద్దరికి క్లిన్ కారా కూతురు ఉంది. మెగా వారసురాలు క్లిక్ కారా ఆలనా పాలనతో పాటు తన బిజినెస్ వ్యవహారాలను కూడా చూస్తున్నారు ఉపాసన. ఐతే ఆమె ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో మెగా ఫ్యామిలీ కి వెళ్లాక మాత్రం చాలా మార్పులు చేసుకుందట. పెరుగు మాత్రమే కాదు ఇంకా చాలా విషయాల్లో ఉపాసన అత్తంటికి వెళ్లాక మార్చుకుందని తెలుస్తుంది.

రాం చరణ్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది ఉపాసన. అందుకే ఆమె మెగా కుటుంబానికే కాదు మెగా ఫ్యాన్స్ కి కూడా బాగా దగ్గరైంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ తో ఉపాసన చేసే కార్యక్రమాలు ఎంతో మందికి స్పూర్తిగా నిలుస్తున్నాయి. మెగా కోడలుగా ఉపాసన తనకు తెలిసిన హెల్త్ సీక్రెట్స్ ఇంకా హెల్తీ ఫుడ్ గురించి కూడా చెబుతూ ఫాలోవర్స్ ని గైడ్ చేస్తుంటారు.

ఫ్యామిలీతో టైం స్పెండ్..

చిరంజీవి, రాం చరణ్ ఎంత సినిమాలతో బిజీగా ఉన్నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర పూర్తి చేసే పనుల్లో ఉన్నారు. ఓ పక్క అనిల్ రావిపూడితో సంక్రాంతికి రిలీజ్ చేసేలా సినిమా చేస్తున్నారు. రాం చరణ్ పెద్ది షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడన్నది ఇంకా క్లారిటీ రాలేదు. పెద్ది సినిమా మాత్రం 2026 మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు.

పెద్ది తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రాం చరణ్. సుక్కు తో రంగస్థలం లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన చరణ్ ఈసారి అంతకుమించే సినిమాతో వస్తారని తెలుస్తుంది. సినిమా హార్స్ రైడింగ్ నేపథ్యంతో ఉంటుందని టాక్.

Tags:    

Similar News