హరిహర సినిమా స్క్రీనింగ్ ఆపేసిన థియేటర్.. అంతా ఫ్యాన్స్ వల్లే
ఈ సంఘటన బ్యాక్ సైడ్ స్క్రీన్ పై సినిమా నిలిపివేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.;
థియేటర్లలో పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్ హాలు లోపలే కాదు, బయట కూడా సందడి వాతావరణం నెలకొంటుంది. ఫ్యాన్స్ ఈలలు, గోలలు, కేరింతలు, చప్పట్లతో కోలాహలంగా ఉంటుంది. అయితే తాజాగా హరిహర వీరమల్లు సినిమాకూ ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్యాన్స్ గందరగోళానికి భయపడ్డ థియేటర్ సిబ్బంది, సినిమా ప్రదర్శనను నిలిపివేసింది.
ఇది జరిగింది ఎక్కడో కాదు. యూకేలోని ఓ థియేటర్ లో జరిగింది. ఫ్యాన్స్ పేపర్లు విసురుతూ సినిమా ఎంజాయ్ చేస్తుంటే, గందరగోళం సృష్టిస్తున్నారన్న ఆరోపణలతో థియేటర్ సిబ్బంది సినిమాను నిలిపివేసింది. థియేటర్ కు సంబంధించిన సిబ్బంది ఇద్దరు వ్యక్తులు హాలు లోపలికి వచ్చి, ప్రేక్షకులతో వాదనకు దిగారు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.
ఈ సంఘటన బ్యాక్ సైడ్ స్క్రీన్ పై సినిమా నిలిపివేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. భారతీయ సినిమాకు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగా, సినీ వరల్డ్ స్టాఫ్ మెంబర్స్ మధ్యలోనే సినిమా ప్రధర్శనను నిలిపివేశారు. అని ఈ వీడియోకు క్యాప్షన్ జోడించారు. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. సినిమా హాలులో కేరింతలతో మూవీ ఎంజాయ్ చేయడంలో తప్పేం ఉంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
కాగా, ఈ సినిమా ప్రీమియర్స్ కు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. బ్యాండు చప్పుళ్లు, డీజే, లైటింగ్స్ తో హైదరాబాద్ లోని పలు సెంటర్లలో ధూమ్ ధామ్ హవా చేశారు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలో రిలీజ్ కావడంతో టపాకాయలు పేలుస్తూ తమ అభిమాన హీరో సినిమా విడుదలను పండుగలా చేసుకున్నారు.
జూలై 24న రిలీజైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 31.50 కోట్ల కలెక్షన్లు సాధించింది. రిలీజ్ కు ముందు రోజు అడ్వాన్స్ ప్రీమియర్ షో లకు రూ. 12.7 కోట్లు వచ్చాయట. ఓవరాల్ గా రూ.44.20 కోట్ల (గ్రాస్ ) సాధించింది. దీంతో ఈ సినిమా పవన్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన మూవీగా నిలిచింది.