చిక్కుల్లో పడ్డ ఉదయనిధి.. అసలు ఏమైందంటే ?

కావేరి జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కావేరీ నదీ జలాల సమస్యపై ఇందుకు స్పందించడం లేదు. నోరు మెదపడం లేదు అంటూ ఆరోపణలు గుప్పించారు.

Update: 2026-08-04 07:25 GMT

ప్రముఖ సినీ నటుడు, డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తాజా పరిణామాలతో చిక్కుల్లో పడ్డారు. ముఖ్యంగా తంజావూరులో జరిగిన కావేరీ జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి ప్రసంగిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ సినీ నటి త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు ప్రధాన కారణం. కావేరి జలాల సాధన నిరసన సభలో ఉదయనిధి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కావేరీ నదీ జలాల సమస్యపై ఇందుకు స్పందించడం లేదు. నోరు మెదపడం లేదు అంటూ ఆరోపణలు గుప్పించారు.

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి..

ఉదయనిధి మాట్లాడుతున్న సమయంలో సభలోని డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా త్రిష.. త్రిష.. అంటూ చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. కార్యకర్తల తీరును వారించాల్సిన ఉదయనిధి.. నవ్వుతూ డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో తీవ్ర విమర్శలకు దారి తీసింది."ఎక్కడ నీళ్ళు వచ్చినా.. రాకపోయినా.. అక్కడ మాత్రం నీళ్లు రావాలంటూ" ఆయన చేసిన కామెంట్లు చాలా వివాదాస్పదంగా మారాయి.

టీవీకే పార్టీ ఆగ్రహం..

అయితే ఆ తర్వాత ఉదయనిధి కావేరి జలాల గురించి మాత్రమే తాను మాట్లాడాను అంటూ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిపై ఆయన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ వేదికలపై ప్రత్యర్థి పార్టీలను విమర్శించే క్రమంలో ఒక మహిళా నటి పేరును లాగడం, పైగా బహిరంగంగా ఆమెపై అసభ్యకర మాటలు మాట్లాడడం పద్ధతిగా లేదు అంటూ టీవీకే పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్..

అంతేకాదు మహిళల గౌరవాన్ని దిగజార్చేలా వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ప్రవర్తించిన ఉదయనిధి స్టాలిన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళా కమిషన్ కి అధికారికంగా ఫిర్యాదు కూడా చేసింది. మరొకవైపు బిజెపితో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు కూడా ఉదయనిధి పై మండిపడుతున్నారు . ఉదయనిధి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.

త్రిష స్పందిస్తుందా?

గత కొంతకాలంగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి - త్రిష మధ్య రహస్య రిలేషన్ ఉందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ అధికారం చేపట్టిన తర్వాత కూడా త్రిష పేరును ఎక్కువగా బయటకి లాగుతూ విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాజకీయ ప్రతిపక్ష పార్టీలు కూడా త్రిష పేరును ఉద్దేశించి బహిరంగ సభలలో కామెంట్లు చేయడం సభ్యంగా లేదు అంటూ ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై త్రిష ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News