శ్రీలీల ఆ సినిమాను సైలెంట్ గా చుట్టేసిందే!

`ఆషీకీ` ప్రాంచైంజీ నుంచి అనురాగ్ బ‌సు ద‌ర్శ‌కత్వంలో `ఆషీకీ 3` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.;

Update: 2025-11-30 17:54 GMT

`ఆషీకీ` ప్రాంచైంజీ నుంచి అనురాగ్ బ‌సు ద‌ర్శ‌కత్వంలో `ఆషీకీ 3` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కార్తీక్ ఆర్య‌న్ హీరోగా న‌టిస్తున్నాడు. హీరోయిన్ గా తెలుగు న‌టి శ్రీలీల న‌టిస్తోంది. ఈ సినిమాతో అమ్మ‌డు బాలీవుడ్ లో లాంచ్ అవుతుంది. న‌టిగా శ్రీలీల కెరీర్ ని టర్న్ చేసే చిత్రంగా చెప్పొచ్చు. ఇప్ప‌టి వ‌ర‌కూ శ్రీలీల పోషించిన పాత్ర‌ల‌కు భిన్న‌మైన రోల్ ఇది. కార్తీక్ ఆర్య‌న్, శ్రీలీల మ‌ధ్య రొమాంటిక్ బాండింగ్ అన్న‌ది హైలైట్ కానుంది. ఈ నేప‌త్యంలో శ్రీలీలపై ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన స‌రైన అప్ డేట్ రావ‌డం లేదు.

సినిమా ప్రారంభ‌మైందా? పూర్త‌యిందా? అన్న దానిపై స‌రైన క్లారిటీ లేదు. వ‌చ్చే ఏడాది రిలీజ్ అవుతున్న చిత్రంగానే ఇంత‌వ‌ర‌కూ వార్త‌ల్లో హైలైట్ అయింది. కానీ అస‌లు సంగ‌తేంటంటే ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయాల‌నుకున్నారుట‌. ఇప్ప‌టికే రిలీజ్ అవ్వాల‌ని వినిపించింది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల రిలీజ్ అవ్వ‌లేద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. ఆ కారణాలు ఏంటి? అన్న‌ది బ‌య‌ట‌కు రాలేదు గానీ తాజా స‌మాచారంతో సినిమా షూటింగ్ పూర్త‌యిందా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చిత్ర వ‌ర్గాల నుంచి అధికారిక స‌మాచారం లేక‌పోవ‌డంతోనే ఈ సందేహాల‌న్నీ.

తాజాగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది మేలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారట‌. మూడ‌వ భాగం కూడా భావోద్వేగం, సంగీతం ప్ర‌ధానంగా సాగే చిత్రంగానే ఉంటుందంటున్నారు. ఇందులో ఓ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు గెస్ట్ రోల్ పోషిస్తున్నాడుట‌. అత‌డు ఇత‌డేనా? అన్న సందేహాలు మొద‌ల‌య్యాయి. మొద‌టి భాగానికి న‌దీమ్-శ్ర‌వ‌ణ్ సంగీతం అందించ‌గా, రెండవ‌ భాగానికి ప్రీత‌మ్ చ‌క్ర‌వ‌ర్తి సంగీతం అందించారు. మూడ‌వ భాగానికి కూడా ప్రీత‌మ్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నారు. దీంతో ఆ గెస్ట్ రోల్ అత‌డే పోషిస్తున్నాడా? అన్న చ‌ర్చ జరుగుతోంది. అలాగే `ఆషీకీ 3` టైటిల్ తో కాకుండా `తూ మేరీ జింద‌గీ హై` అనే టైటిల్ తో సినిమా రిలీజ్ కానుంద‌ని వార్త‌లొచ్చాయి.

అయితే ఈ టైటిల్ ఏ కార‌ణంగా మారుస్తున్నార‌న్న‌ది తేలాల్సి ఉంది. `తూ మేరీ జింద‌గీ హై` అంటే తెలుగులో `నువ్వే నా జీవితం` అని అర్దం. కానీ ఈ టైటిల్ ను తెలుగు ఆడియ‌న్స్ కూడా అంగీక‌రించ‌డం లేదు.ఓ బ్రాండ్ ప్రాంచైజీ టైటిల్ ని ఇలా మార్చ‌డం ఓపెనింగ్స్ పై ప్ర‌భావాన్ని చూపిస్తుంద‌ని ట్రేడ్ పండితులు అభి ప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి ఈ విమ‌ర్శ‌ల్ని మేక‌ర్స్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి.

Tags:    

Similar News